Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కల్లాల లో ఉన్న ధాన్యం నిల్వలను సత్వరం కొనుగుళ్ళుకు ఏర్పాటు చేయండి:ఎమ్మెల్యే సండ్ర

కల్లాల లో ఉన్న ధాన్యం నిల్వలను సత్వరం కొనుగుళ్ళు ఏర్పాటు చేయండి:ఎమ్మెల్యే సండ్ర
-మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి కి సత్తుపల్లి ఎమ్మెల్యే విజ్నప్తి
-స్పందించిన మంత్రి ,పౌరసరఫరా శాఖ మంత్రికి ఫోన్
– ఫాలోఅప్ చేయాలనీ కమిషనర్ కు ఆదేశాలు

ఒక పక్క వర్షాలు మరో పక్క పంట కల్లాలలో ఉన్న ధాన్యం కొనుగోలుకు మిల్లరులు ముందుకు రక వచ్చిన ధాన్యాన్ని కాటా వేసుకున్న తీసుకోని పోక ఇబ్బందులకు గురౌతున్న రైతులను ఆదుకోవాలని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య వ్యవసాయమంత్రి ని కలిసి కోరారు . ప్రధానంగా తన నియోజవర్గమైన సత్తుపల్లిలో ఎక్కువగా పండుతున్న వారి పంట కల్లాలలో ఉంది రైతులు పడుతున్న ఇబ్బందులను , జరుగుతున్న నష్టాన్ని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఫోన్ చేసి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వానిని తీసుకోని పోయేలా ఏర్పాటు చేయాలనీ కోరారు . వ్యవసాయ శాఖ
కమిషనర్ ను మంత్రి సత్వర చర్యలకు ఆదేశాలు జారీచేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల ఇబ్బందులపై ఎమ్మెల్యే వెంకటవీరయ్య చెప్పిన విషయాలపై ద్రుష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు….

సత్తుపల్లి నియోజకవర్గంలో పంట కల్లాలలో ఉన్న ధాన్యం నిల్వలను కొనుగోలుకు సత్వర ఏర్పాట్లు చేయాలని కోరుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హైదరాబాదులో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వారి కార్యాలయంలో కలిశారు. కొద్దిరోజులుగా అధిక వర్షాలు పడుతున్నాయని, కొనుగోలు జాప్యం చేస్తే వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో నష్టం సంభవించే అవకాశం ఉందని దాన్యం దిగుమతికి పెద్దపల్లి మిల్లర్లతో మాట్లాడి దిగుమతులకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ కు ఫోన్ చేసి దిగుమతులకు ఏర్పాట్లు చేయాలని మిల్లర్లతో మాట్లాడాలని వారికి తెలిపి, కమీషనర్ ని ఆదేశించారు.

Related posts

అమెరికాలో గుంటూరు యువతి మృతి…

Ram Narayana

భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజం: కేసీఆర్…

Drukpadam

ఏపీలో భారీ వర్షాలు.. విశాఖ, కాకినాడ తీరాల్లో భయపెడుతున్న రాకాసి అలలు…

Ram Narayana

Leave a Comment