Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్వేక్షించాలి …మంత్రి పొంగులేటి

అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తు, పనుల పురోగతిని పర్యవేక్షించాలని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు జవాబుదారితనంతో పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు 24×7 అందుబాటులో ఉండాలని, ఏ సమయంలో అయిన డాక్టర్ ఉంటారని ప్రజల్లో నమ్మకం రావాలని అన్నారు. ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, మార్చి నెలాఖరులోగా అన్ని హెల్త్ సబ్ సెంటర్ల భవనాలు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను పటిష్ట పరచాలన్నారు. మూతబడ్డ పాఠశాలల వివరాలు సమర్పించాలని, వారిని పునఃప్రారంభం చేయుటకు చర్యలు చేపట్టాలని అన్నారు. సమ్మర్ లోనే పిల్లల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేయాలన్నారు. పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, విద్యార్థులకు తగ్గట్టు టాయిలెట్ల సౌకర్యం వుండాలని తెలిపారు. పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం పై నివేదిక సమర్పించాలన్నారు. మండల విద్యాధికారుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆర్ఎంఎస్ఏ ద్వారా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నర్సింగ్ కళాశాల భవనం నాణ్యత ప్రమాణాలతో, అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలన్నారు. తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల నుండి, 100 పడకలకు అప్ గ్రేడ్ అయిందని, అందుకు అనుగుణంగా భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆపరేషన్ థియేటర్, కాంపౌండ్ వాల్ తదితర పనుల త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కూసుమంచిలో ఆయుష్ భవన నిర్మాణం పూర్తి చేయాలన్నారు. టెండర్ ప్రక్రియలో ఉన్న చెక్ డ్యామ్ పనుల వివరాలు సమర్పించాలన్నారు. పాలేరు కెనాల్ మెయిన్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లో ఉన్న భూములన్నీ డిమార్కు చేసి, ఫెన్సింగ్ చేపట్టాలన్నారు.

నాయకన్ గూడెం లో ఐబీ విశ్రాంతి గృహ నిర్మాణానికి టెండర్ రీకాల్ చేయాలన్నారు. ఎన్ఎస్పీ, ఎస్ఆర్ఎస్పి మంజూరు పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలన్నారు. పెద్దతాండ, ఏదులాపురం, గుదిమళ్ళ, చిన్నవెంకటగిరి గ్రామాల్లో పురోగతిలో ఉన్న, ఇంకనూ ప్రారంభం కాని పనుల వివరాలు సమర్పించాలన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళల ప్రయాణికులు పెరిగినట్లు, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణమై చర్యలు తీసుకోవాలన్నారు. సేకరించాల్సిన భూమిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు సమర్పించాలన్నారు. వరదకు అనుగుణంగా వెడల్పు ఉండాలన్నారు. లిఫ్ట్ ఇర్రిగేషన్లన్ని పనిచేయు స్థితిలోకి తేవాలన్నారు. గ్రామాల్లో వ్రేలాడే విద్యుత్ వైర్లు లేకుండా చేయాలన్నారు. గ్రామాలు అవసరానికి ఉన్న చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేయాలన్నారు. హైటెన్షన్ తీగలు ఇండ్లపై నుండి ఉంటే షిఫ్టింగ్ కి చర్యలు తీసుకోవాలని అన్నారు. పశు వైద్యశాలల్లో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. పశువులకు టీకాలు, మందుల సరఫరా చేయాలన్నారు. గట్టు సింగారం, ముజ్జుగూడెం లలో శిథిలావస్థకు చేరిన పశు వైద్యశాల భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. గొర్రెల అభివృద్ధి పథకం విషయమై త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్వంత భవనాలు మంజూరుకాని అంగన్వాడీ భవనాలు ఇజిఎస్ లో చేపట్టుటకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మరమ్మత్తులు, కాంపౌండ్ వాల్, టాయిలెట్ల నిర్మాణం కావాల్సిన చోట ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

పాలేరు నియోజకవర్గానికి మంజూరయిన మినీ స్టేడియం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు జులై కల్లా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంచే చేపట్టే పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల పురోగతిలో సమస్యలు ఉంటే వెంటనే దృష్టికి తేవాలని మంత్రి అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం కాంగ్రెస్ లో తిరుగుబాటా …?సర్దుబాటా …??కీం కర్తవ్యం

Ram Narayana

సత్తుపల్లి ,వైరా ,మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు భట్టి ,తుమ్మల,పొంగులేటి ప్రచారం

Ram Narayana

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..

Ram Narayana

Leave a Comment