Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అయోధ్య వార్తలు

ఇంద్రలోకమా …!అన్నట్లుగా అయోధ్యాపురి

బాలభానుడు .. ఈ బాలరాముడు!

  • అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ
  • 5 అడుగుల తేజోమయ మూర్తి
  • పద్మపీఠంపై స్థానక భంగిమలో దర్శనం  
  • కృష్ణశిలలో మలచిన యోగిరాజ్
  • ఆధ్యాత్మిక చరిత్రలో ఇది ఒక అధ్యాయం
Ayodhya Bala Rama Temple

ఇంద్రలోకం మనం చూడలేదు …కానీ నేడు అయోధ్యాపురిలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వివిధరంగాలలో ప్రముఖలు ఆహ్వానించారు …ఆహ్వానితులు మాత్రమే అయోద్యలోకి అనుమతిచ్చారు ..ప్రాణప్రతిష్ట అనంతరం మందిరం ముందే ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగం చేశారు …ఈ సందర్భంగా గుడి పరిసరాలు గుడిని , అయోధ్య పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చు దిద్దారు … ఇంద్రలోకం అంటే ఇదేనేమో అన్నంతగా చూపరులను ఆకట్టుకుంది … …సోమవారం జరిగిన ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఎంతో ఆశక్తిగా టీవీ లకు అతుక్కుపోయి చూశారు … …

శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు … సూర్యుడి తేజస్సును కలిగినవాడు. అలాంటి రాముడి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయోధ్య. ‘రామాయణం’ చదివిన ప్రతి ఒక్కరూ, అప్పట్లో తాము అయోధ్య వాసులమైతే బాగుండునని అనుకుంటారు. అప్పుడు తాము అక్కడ ఉంటే ఆయనను అడవులకు వెళ్లనిచ్చేవాళ్లము కాదని అనుకుంటారు. అలా రామచంద్రుడు ఆనాటి ప్రజలను మాత్రమే కాదు, ఆ తరువాత యుగాలను కూడా ప్రభావితం చేశాడు.

బాల రాముడికి కౌసల్యాదేవి నింగిలోని చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేదట. ఆ తరువాత ఆ చంద్రుడి దిష్టే తగులుతుందేమోనని దిష్టి తీసేదట. చంద్రుడే అసూయపడే సౌందర్యం రామచంద్రుడి సొంతం. అలాంటి ఆ స్వామి బాలరాముడిగా ఇప్పుడు అయోధ్యలో కొలువయ్యాడు. ముద్దులొలుకుతూ .. ముచ్చటగొలుపుతూ మనసు మనసుకి మరింత చేరువయ్యాడు. శ్రీరాముడు మళ్లీ అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో ఊహించుకున్నవారు ఇప్పుడు ఆ సందడిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. 

అయోధ్యలోని రామాలయాన్ని ఇంతవరకూ ఎక్కడా చూడని ఒక కొత్త నిర్మాణ శైలిలో నిర్మించారు. ప్రశాంతతకు … పవిత్రతకు .. శిల్ప నైపుణ్యానికి ప్రతీకగా ఈ ఆలయం కనిపిస్తోంది. గర్భాలయంలో  5 అడుగుల ఎత్తు కలిగిన ‘కృష్ణశిల’తో మలిచిన బాలరాముడి మూర్తిని ప్రతిష్ఠించారు. పద్మపీఠంపై నిలిచిన బాలరాముడి తేజస్సు … బాలభానుడితో పోటీపడుతోంది. ఒక చేతిలో ధనుస్సు – మరో చేతిలో విల్లు .. నుదుటున ‘సూర్య తిలకం .. ధరించి చిరుమందహాసం చేస్తున్న బాలరాముడి మూర్తిని చూస్తే కనురెప్పలు కొట్టుకోవడం మానేస్తాయి .. మనసులన్నీ అనుభూతుల అక్షయ పాత్రలవుతాయి.  బాలరాముడు ధరించిన ఆభరణాలను .. వస్త్రాలను శిల్పంలోనే మలచిన తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. బాలరాముడికి ఐదారేళ్లు వచ్చేవరకూ ‘రామ్ లల్లా’ అని పిలిచేవారట. అందువలన ఇక్కడి స్వామిని ‘రామ్ లల్లా’ అని కూడా పిలుస్తున్నారు. స్వామివారిచుట్టూ ఉన్న ‘మకర తోరణం’లో ఇరు వైపులా దశావతార మూర్తులను మలిచారు. తలపై గల తోరణ భాగంలో శంఖు చక్రాలు ..  ఓం .. స్వస్తిక్ .. చిహ్నాలు, తల వెనుక భాగంలో తేజోమయ చక్రం కనిపిస్తున్నాయి. హనుమ .. గరుత్మంతుడి సూక్ష్మ రూపాలు స్వామివారి పాద భాగంలో దర్శనమిస్తున్నాయి. 

మైసూర్ లోని ‘హెగ్గే దేవన్ కోట్’లో లభించిన కృష్ణశిలలో ‘యోగిరాజ్’ అనే శిల్పకారుడు బాలరాముడి మూర్తిని తీర్చిదిద్దాడు. భారతీయులంతా ఇప్పుడు ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆయన మలచిన మూర్తిని మనో వేదికపై నిలుపుకుంటున్నారు. చూపులతోనే స్వామివారి సన్నిధిలో దీపాలు పెడుతున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వమంతటా విస్తరింపజేసేవాడు ఈ అందాల రాముడు .. తలచుకున్నవారినెల్ల తరింపజేసేవాడు ఈ అయోధ్య రాముడు.

రేపటి నుంచే సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శనం.. అయోధ్యలో దర్శన వేళలు, హారతి సమయాలు ఇవే!

  • ఉదయం 7 – 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీరాముడి దర్శన వేళలు
  • ఉదయం 6:30 గంటలకు, రాత్రి 7:30 గంటలకు హారతి సమయాలు
  • ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో పాస్‌లు పొందే అవకాశాన్ని కల్పించిన అయోధ్య ఆలయ ట్రస్ట్
Ayodhya Rama darshan starts from tomorrow for the common people

యావత్ దేశం, సమస్త హిందూ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూసిన అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం వైభవోపేతంగా ముగిసింది. రాముడి జన్మస్థలంలో వేద మంత్రోచ్చారణ, జైశ్రీరామ్ నినాదాల మధ్య జరిగిన ఈ మహాఘట్టంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అతిరథ మహారథులు ఎందరో పాల్గొన్నారు. అయితే సాధారణ భక్తులకు మంగళవారం (జనవరి 23) నుంచి రామ్‌లల్లా దర్శనమివ్వనున్నాడు.  ఈ మేరకు అయోధ్య రామాలయం భక్తులకు స్వాగతం పలుకుతోంది. అయితే అయోధ్య వెళ్లే భక్తులు దర్శన వేళలు, పాస్‌లు ఏవిధంగా పొందాలి వంటి కొన్ని విషయాలను ముందే తెలుసుకొని వెళ్లడం మంచిది.

దర్శనం, హారతి సమయాలు..
భక్తులు ఉదయం ఉదయం 7 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీరాముడి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఉదయం 6:30 గంటలకు ఉదయం హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యా హారతిని వీక్షించవచ్చు. 

పాస్‌లు ఎలా పొందాలి?
‘హారతి’ లేదా ‘దర్శనం’లో పాల్గొనేందుకు భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా పాస్‌లు పొందొచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. మొబైల్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా వ్యక్తుల గుర్తింపు నిర్ధారణ అవుతుంది. అనంతరం ‘మై ప్రొఫైల్’ సెక్షన్‌పై క్లి చేయాలి. హారతి లేదా దర్శనంలో కావాల్సిన స్లాట్‌ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాలన్నింటిని చెక్ చేసుకొని బుకింగ్‌ను పూర్తి చేసి పాస్‌ను పొందొచ్చు. ప్రవేశానికి ముందు ఆలయం కౌంటర్ వద్ద భక్తులు పాస్‌ను పొందొచ్చు. కాగా ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్ ప్రస్తుతం హోల్డింగ్‌లో ఉంది. అధికారులు మరికొన్ని గంటల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక ఆఫ్‌లైన్ పాస్‌లు పొందాలనుకునేవారు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి పాస్‌ను పొందొచ్చని అయోధ్య ఆలయ ట్రస్ట్ వెబ్‌సైట్ చెబుతోంది. అదే రోజున పాస్‌లను బుక్ చేసుకోవాలనుకునే వారి విషయంలో ‘తొలుత వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం’ సూత్రం ఆధారంగా పాస్‌లను అందజేస్తారు. హారతికి 30 నిమిషాల ముందు ఆలయం వద్ద ఉండాలి. పాస్‌లపై క్యూఆర్ కోడ్‌ల ఆధారంగా సులభంగా భక్తులను అనుమతిస్తారని అయోధ్య ఆలయ ట్రస్ట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక ఆలయం వద్దకు చేరుకోవడానికి భక్తులకు స్థానిక రవాణా సౌకర్యాలను కూడా అందిస్తోంది. ఆటో-రిక్షాలు, సైకిల్ రిక్షాల ద్వారా సరయు నది ఒడ్డున ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.

Related posts

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

Ram Narayana

అయోధ్య వేడుకలకు అద్వానీ దూరం.. ఎందుకంటే..!

Ram Narayana

 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… అయోధ్యకు వాహనాల రాకపై తాత్కాలిక నిషేధం

Ram Narayana

Leave a Comment