Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఆస్కార్ కు వేళాయె… ముఖ్యమైన నామినేషన్స్ ఇవిగో!

  • మొదలైన ఆస్కార్ కోలాహలం
  • వివిధ కేటగిరీలకు నేడు తుది నామినేషన్ల ప్రకటన
  • మార్చి 10న ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల పండుగకు తెర లేచింది. ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే మోషన్ పిక్చర్స్ అకాడమీ నేడు నామినేషన్లను ప్రకటించింది. అటామిక్ సైన్స్, రాజకీయాలు నేపథ్యంలో తెరకెక్కిన ఓపెన్ హైమర్ చిత్రం ఏకంగా 13 నామినేషన్లను దక్కించుకుంది. ఆ తర్వాత బార్బీ చిత్రానికి 6 నామినేషన్లు లభించాయి. 96వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 10న జరగనుంది. 

గతేడాది ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో హంగామా సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఆస్కార్ వేడుకల్లో పెద్దగా భారతీయ సంరంభం లేనట్టే. భారతీయ నేపథ్యంతో తెరకెక్కిన ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీకి మాత్రం బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో నామినేషన్ లభించింది. కెనడాకు చెందిన నిషా పహూజా ఈ డాక్యుమెంటరీకి దర్శకురాలు.

ముఖ్యమైన విభాగాల నామినేషన్ల వివరాలు…

ఉత్తమ చిత్రం
1. అమెరికన్ ఫిక్షన్
2. మాయెస్ట్రో
3. అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
4. ఓపెన్ హైమర్
5. బార్బీ
6. పాస్ట్ లైవ్స్
7. ది హోల్డోవర్స్
8. పూర్ థింగ్స్
9. కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్
10. ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్

ఉత్తమ దర్శకుడు
1. జస్టిన్ ట్రీట్- అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
2. మార్టిన్ స్కోర్సెసీ- కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
3. క్రిస్టొఫర్ నోలాన్- ఓపెన్ హైమర్
4. యోర్గాస్ లాంథిమోస్- పూర్ థింగ్స్
5. జోనాథన్ గ్లేజర్- ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్

ఉత్తమ నటుడు
1. బ్రాడ్లే కూపర్- మాయెస్ట్రో
2. కోల్మన్ డొమింగో- రస్టిన్
3. పాల్ గియామాటి- ది హోల్డోవర్స్
4. సిలియాన్ మర్ఫీ- ఓపెన్ హైమర్స
5. జెఫ్రీ రైట్- అమెరికన్ ఫిక్షన్

ఉత్తమ నటి
1.అనెట్టే బెనింగ్- న్యాడ్
2. లిలీ గ్లాడ్ స్టోన్- కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
3. శాండ్రా హల్లర్- అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
4. కేరీ ముల్లిగాన్- మాయెస్ట్రో
5. ఎమ్మా స్టోన్- పూర్ థింగ్స్

ఉత్తమ సహాయ నటుడు
1. స్టెర్లింగ్ కే బ్రౌన్- అమెరికన్ ఫిక్షన్
2. రాబర్ట్ డి నీరో- కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
3. రాబర్డ్ డౌనీ జూనియర్- ఓపెన్ హైమర్
4. ర్యాన్ గోస్లింగ్- బార్బీ
5. మార్క్ రఫాలో- పూర్ థింగ్స్

ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం
1. అయో కాపిటానో- ఇటలీ
2. పర్ఫెక్ట్ డేస్- జపాన్
3. సొసైటీ ఆఫ్ ది స్నో- స్పెయిన్
4. ది టీచర్స్ లాంజ్- జర్మనీ
5. ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్- బ్రిటన్

Related posts

జెట్ లాగ్ వల్ల ఆ రోజు స్టేజ్ పై నిద్ర ముంచుకొచ్చింది..: బైడెన్

Ram Narayana

లెబనాన్ లో పేజర్ పేలుళ్ల వెనక మొసాద్!

Ram Narayana

భారత్ కొన్ని లక్షల మందిని కష్టాలపాలు చేస్తోంది..కెనడా ప్రధాని ఆరోపణ

Ram Narayana

Leave a Comment