Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తొలివెలుగు జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసిన హుజూర్‌నగర్ పోలీసుల

తొలివెలుగు జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసిన హుజూర్‌నగర్ పోలీసుల
-హుజూర్ నగర్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
-14 రిమాండ్ విధించిన కోర్ట్
-రఘు అరెస్ట్ ను ఖండించిన జరన్లిస్ట్ సంఘాలు, బీజేపీ ,కాంగ్రెస్ ,టి జె యస్

రాజ్ న్యూస్ లో యాంకరగా పనిచేస్తున్న జర్నలిస్ట్ రఘును వెంటనే విడుదల చేయాలి పలు జర్నలిస్ట్ సంఘాలు ప్రజాసంఘాలు రాజాకీయ పార్టీల డిమాండ్ చేశాయి . తొలి వెలుగు యాంకర్ రఘును 9గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నెంబర్ ప్లేట్ లేని జీపులో… తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లారు. “కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్” అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ చేసిన రఘును హుజురాబాద్ పోలీసులు అక్కడ కోర్టులో హాజరు పరిచారు .హుజురాబాద్ కోర్ట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన్ను జైలులో తరలించారు . రఘు అరెస్ట్ ఉదంతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రఘును వెంటనే భేషరత్ గా విడుదల చేయాలనీ ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం పై ఆయన మండిపడ్డారు. కోకాపేట కాందీశీకుల భూమి కుంభకోణం తోపాటు 50వేల కోట్లు, ఐడిపిల్ భూ కుంభకోణం, 20 వేల కోట్లు ఐకియా ముందు భూకుంభకోణం 5 వేల కోట్లు ఈ కుంభకోణాలను ప్రశ్నించినందుకే రఘు కిడ్నాప్ అని అన్నారు . వేల కోట్ల దోపిడీని మనం మౌనంగా చూస్తూ ఊరుకుందామా..? కాంగ్రెస్, బిజెపి నేతలు ‘హోల్ సేల్’గా అమ్మడుపోయారు. ఈ కుంభకోణాల గురించి నోరు మెదపటం లేదు. అందుకే మనం గొంత్తుదాం. ఈ దోపిడీ దొంగల భరతం పడదాం. ఆయన పిలుపునిచ్చారు .

హుజూర్‌నగర్ గుర్రం పోడు భూముల వ్యహరంలో పేద గిరిజనుల కి అండగా నిలిచి రాజ్ న్యూస్ టివిలో లో కథనాలు ప్రసారం చేసినందుకు రఘు పై రాజద్రోహం వంటి కుట్రకేసులు గతంలో బనాయించి ఆ కేసుల్లో ఇప్పుడు అరెస్టు చేయటం ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యకి దిగటం అన్య
ఎప్పుడో అక్రమంగా పెట్టిన కేసులో ఇప్పుడు అరెస్టు చేయటం విడ్డూరంగా ఉందని టిపిసిసి జనరల్ సెక్రెటరీ&నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్(9000919101) గురువారం రఘు అరెస్టు ను ఖండించారు ప్రైవేటు కార్పోరేట్ హాస్పిటల్స్ దోపిడిని అనునిత్యం తొలివెలుగుద్వారా బయట పెడుతున్న రఘు ని జీర్ణించుకోని కెసిఆర్ ప్రభుత్వం.
ప్రతిరోజూ కరోనా రోగులకి అండగా నిలుస్తున్న రఘు బయట తిరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమాదమని గ్రహించి కార్పొరేట్ హాస్పిటల్స్ తో చేతులు కలిపిన రాష్ట్ర ప్రభుత్వం రఘు అడ్డు తొలగించుకోవటానికి పాత కేసులో సమయం గాని సమయంలో కరోన విజృంభిస్తున్న తరుణంలో అరెస్టు చేసిందని మానవతారాయ్ మండిపడ్డారు.ఈ అరెస్టు ను ఓయూ జెఏసి చైర్మన్ కొప్పుల ప్రతాపరెడ్డి, ఓయూ జెఏసి & నిరుద్యోగ జెఏసి నాయకులు జానకిరాం ముదిరాజ్, ముదావత్ భిక్షునాయక్,భండ మధులు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు

 

 

 

 

 

Related posts

ఈడీ విచారణ సందర్భంగా ఎల్.రమణకు అస్వస్థత… ఆసుపత్రికి తరలింపు!

Drukpadam

చికెన్ వండనన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

Drukpadam

ఫంక్షన్ ఉందని నమ్మించి భార్యను బయటకు తీసుకెళ్లి దారుణంగా చంపేసిన భర్త!

Ram Narayana

Leave a Comment