Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ టెండర్లకు బీడ్ రాకపోవడంపై జగన్ నిరసన :కేంద్రంపై అసంతృప్తి …

వ్యాక్సిన్ టెండర్లలో బీడ్ రాకపోవడంపై జగన్ నిరసన :కేంద్రంపై అసంతృప్తి – -ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాసిన ఏపీ సీఎం జగన్
-కేంద్రం వ్యాక్సిన్ల సరఫరాపై పలు రాష్ట్రాల అసంతృప్తి
-వ్యాక్సిన్ల అంశంపై ఒకే గొంతుక వినిపించాలన్న సీఎం జగన్
-గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ వేయలేదని వెల్లడి
-బిడ్ల వ్యవహారం కేంద్రం చేతిలో ఉందని వ్యాఖ్యలు

కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు పలు రాష్ట్రాలను అసంతృప్తికి గురిచేస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాహాటంగానే తమ గళం వినిపించారు. తాజాగా, ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ల అంశంపై దేశంలోని అందరు సీఎంలకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాపై ఒకే గొంతుక వినిపించాలని సీఎం జగన్ ఇతర ముఖ్యమంత్రులను కోరారు. కేంద్రం తీరుపై జగన్ తీవ్రఅసంతృప్తి తో ఉన్నారు. ఇప్పటి వరకు కేంద్రంతో సఖ్యత గా ఉన్న జగన్ మొదటి సరిగా తన నిరసనను బహిరంగ పరిచారు. ముఖ్యమంత్రిలందరు ఒకే గొంతును వినిపించాలని జగన్ కోరడం చర్చనీయాశం అయింది.గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ వేయలేదని వెల్లడించారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో పేర్కొన్నారు. పరిస్థితులు చూస్తుంటే వ్యాక్సిన్ లభ్యతపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సరఫరాలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అంతకు ముందే కేరళ , తమిళనాడు, పశ్చిమ బెంగాల్ , ఒడిశా ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాశారు. జార్ఖండ్ సీఎం సొరేన్ ప్రధాని పై అసంతృప్తి వెలిబుచ్చితే జగన్ ఆయనకు హితవు పలికే ప్రయత్నం చేశారు. ఇప్పడు జగన్ తన నిరసన లేఖ రూపం లో తెలియజేయడం పై సర్వత్రా ఆశక్తి నెలకొన్నది .

 

Related posts

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి :సీఎల్పీ నేత భట్టి

Drukpadam

అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదు: చిరంజీవి అంశంపై మంత్రి బాలినేని!

Drukpadam

బీజేపీ రథాన్ని లాగిన కాంగ్రెస్ ప్రచార రథం!

Drukpadam

Leave a Comment