జాతీయ వార్తలు

ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడు ఎంపీ మృతి

  • లోక్‌సభ ఎన్నికల టిక్కెట్టు రాలేదని ఈరోడ్ ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి మనస్తాపం
  • ఆదివారం తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • కోయంబత్తూర్‌లోని ఓ ఆసుపత్రిలో గురువారం ఉదయం మృతి

ఆత్మహత్యాయత్ననం చేసిన ఈరోడ్ (తమిళనాడు) ఎం‌డీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి గురువారం కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గురువారం ఉదయం కన్నుమూశారు. క్రిమిసంహారక మందు తాగి గణేశమూర్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు అంతకుమునుపు కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు.

Related posts

బీహార్‌లో రికార్డు పోలింగ్.. 70 ఏళ్ల‌ తర్వాత ఇదే అత్యధికం!

Ram Narayana

నవంబర్ 19 డెడ్‌లైన్… చెన్నైలో మారనున్న 3,400 వీధుల పేర్లు..

Ram Narayana

మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌ .. ముగ్గురు మావోయిస్టులు మృతి

Ram Narayana