తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్యంగా పనిచేయాలి …పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయనాయకులు , తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల పార్టీ సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు …రెండు కీలక దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి తన సొంత జిల్లాలో పార్టీ తరుపున పోటీచేస్తున్న తాండ్ర వినోద్ రావు ప్రచార తీరు తెన్నులు పరిశీలించేందుకు వచ్చిన పొంగులేటి జిల్లా పార్టీ నాయకులు , రాష్ట్ర పరిశీలకుల సమక్షంలో ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనేక సూచనలు చేశారు…దేశమంతా మోడీ ,మోడీ అంటూ ప్రధాని మోడీ పాలనను తిరిగి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని , ఖమ్మంలో కూడా అనుకూల పవనాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .దేశంలో అబ్కీ బార్, 400 పర్’ అనే నినాదం మరో మోగుతుందని మోడీజీ విధానాలను ప్రజల్లోకి తీసుకోని వెళ్లడం ద్వారా ఆ ఇమేజీని ఓట్ల రూపంలోకి మలచాలని పేర్కొన్నారు .

ఖమ్మంలో టిఫిన్ బైఠక్

ఎన్నికల ప్రచారం లో భాగంగా శుక్రవారం బీజేపీ ఆధ్వరంలో టిఫిన్ బైఠక్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు …పొంగులేటి సుధాకర్ రెడ్డితోపాటు , ఖమ్మం లోకసభ అభ్యర్థి వినోదరావు , ఖమ్మం ,భద్రాద్రి జిల్లాల బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ , రంగా కిరణ్ తదితరులు పాల్గొన్నారు …ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వరంలో అందిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి ఓటర్లను చైతన్యం చేయాలనీ ఈసందర్భంగా పొంగులేటి నాయకులకు సూచించారు … ఇప్పటికే అన్ని పార్టీలకన్నా ప్రచారం లో ముందున్న బీజేపీ మరింత ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు …

Related posts

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు… తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Ram Narayana

ఆసక్తికరం.. ఛైర్మన్ పదవి ఇచ్చిన పార్టీకే మద్దతు అన్న స్వతంత్ర అభ్యర్థి…

Ram Narayana

రాజ్యసభకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం!

Ram Narayana