Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ పిల్లకాకి …టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం …

నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్

  • సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్
  • జగన్ ను పిల్లకాకితో పోల్చిన టీడీపీ అధినేత
  • జగన్ పనిదొంగ అంటూ విమర్శలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. జగన్ నా వయసు గురించి మాట్లాడతాడు… నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని, సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా ఈ జగన్? అని ఎద్దేవా చేశారు. 

“ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడని అడుగుతాడు… తెలుగు రాష్ట్రాల్లో  పిల్లలను అడిగినా చెబుతారు నేను ఏం చేశానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం చేయగలం?” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అంతేకాదు, బనగానపల్లెలో తాను జగన్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు. జగన్ ను పిల్లకాకితో పోల్చారు. నాలాగా రెండ్రోజులు మధ్యాహ్నం ఒంటిగంటకు మంచి ఎండలో మీటింగ్ లు పెట్టగలవా? అని సవాల్ విసిరారు. పనిదొంగ, దోపిడీదారుడు ఈ జగన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related posts

సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

Ram Narayana

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కూలిందడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?: జగన్

Ram Narayana

ఏపీల రివర్స్ ఆయన పెట్టాడు …ఈయన పీకేశారు

Ram Narayana

Leave a Comment