Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ విజృంభణ… ఉచితంగా చికిత్స ప్రభుత్వ నిర్ణయం

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ విజృంభణ… ఉచితంగా చికిత్స ప్రభుత్వ నిర్ణయం
-మహారాష్ట్రలో 5,763 బ్లాక్ ఫంగస్ కేసులు
-ఇప్పటిదాకా 476 మంది మృతి
-పెనుభారంగా బ్లాక్ ఫంగస్ చికిత్స
-రోజుకు రూ.80 వేల వరకు ఖర్చు
-ఆరోగ్య బీమా వర్తింపచేయాలని ప్రభుత్వ నిర్ణయం
కరోనా రోగులను కబళిస్తున్న బ్లాక్ ఫంగస్ ఇప్పుడు మహారాష్ట్రలో విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,763 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, 476 మంది మరణించారు. ఈ నేపథ్యంలో, బ్లాక్ ఫంగస్ చికిత్సకు అధిక ఖర్చు అవుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం (మహాత్మా ఫూలే జన్ ఆరోగ్య యోజన) కింద బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా చికిత్స అందిస్తామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ ఖరీదైనది కావడంతో చాలామందికి పెనుభారంగా మారుతోందని తెలిపారు. తమ ఆరోగ్య పథకం ద్వారా అన్ని వర్గాలకు ఖరీదైన చికిత్స అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఆంఫోటెరిసిన్-బి ఒక్క వయల్ రూ.6 వేల వరకు ఉంటుంది. కనీసం 4 నుంచి 12 వారాల పాటు చికిత్స పొందాల్సి ఉంటుంది. ఒక రోగికి రోజుకు రూ.80 వేల వరకు చికిత్స ఖర్చు అవుతుండడంతో, దాంతో చాలామంది చికిత్స చేయించుకోకుండానే వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Related posts

కోవిడ్ అడుగు పెట్టని దేశాలు ఇవి..!

Drukpadam

6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను అందించనున్నాం : వైట్ హౌస్

Drukpadam

కరోనా లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆస్ట్రేలియాలో రోడ్డెక్కిన ప్రజలు..

Drukpadam

Leave a Comment