Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పని చేసి గెలిపిస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

  • రంజాన్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామన్న రాజగోపాల్ రెడ్డి
  • భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో అసలు బీఆర్ఎస్ లేనే లేదని వ్యాఖ్య
  • తమకు బీజేపీతోనే పోటీ అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పని చేసి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… రంజాన్ తర్వాత తాము ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు.

భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో అసలు బీఆర్ఎస్ లేనే లేదన్నారు. తమకు ఇక్కడ బీజేపీతోనే పోటీ అని పేర్కొన్నారు. 21న పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. మే మొదటివారంలో పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ తెలంగాణకు రానున్నారని తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌గా వెళ్లకుండా కలిసికట్టుగా పని చేసి భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు.

Related posts

కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పిన మంత్రి కేటీఆర్

Ram Narayana

పులి బయటకు వస్తుందంటున్నారు.. బోను రెడీగా ఉంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్

Ram Narayana

తెలంగాణాలో పోటీచేసే బీజేపీ లోకసభ అభ్యర్థులు ….

Ram Narayana

Leave a Comment