ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోట్ల పేరు పరిశీలన
మండవ , ప్రసాద్ రెడ్డి , రఘుమారెడ్డి పేర్ల పై కూడా చర్చ
తనకు అవకాశం ఇప్పించాలని కోరుతున్న రాయల నాగేశ్వరరావు
జిల్లా మంత్రుల అభిప్రాయం తీసుకున్న అధిష్టానం
మరోసారి రాష్ట్ర నాయకత్వాన్ని అభిప్రాయం కోరే అవకాశం
ఈనెల 14 వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భేటీ
కాంగ్రెస్ కు ఖమ్మం సీటు అభ్యర్థి ఎంపికలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది …ఎప్పుడో అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన దగ్గర ముగ్గురు మంత్రుల మధ్య ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది …ఇటీవల రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఖమ్మం లోకసభ సీటు అభ్యర్థి ఎంపిక వ్యహారం మరోసారి చర్చకు వచ్చినట్లు తెలిసింది …జిల్లా మంత్రుల అభిప్రాయం తీసుకున్న అధిష్టానం , రాష్ట్ర నాయకత్వ అభిప్రాయాన్ని కోరే అవకాశం ఉంది …ఈనెల 14 జరిగే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థిని ఫైనల్ చేస్తారని అంటున్నారు …
తాజాగా మాజీ ఎమ్మెల్సీ కొత్తగూడెం టికెట్ ఆశించి పొత్తుల్లో భాగంగా టికెట్ సిపిఐ కేటాయించడంతో నిరాశ చెందిన పోట్ల నాగేశ్వరావు పేరు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం … పోట్ల స్థానికుడే గాక అన్నిరకాల సమర్థుడని అందువల్ల ఆయనకు టికెట్ ఇస్తే కమ్మ సామాజికవర్గానికి ఇచ్చినట్లు ఉంటుందనే అభిప్రాయాలూ ఉన్నాయి… పోట్ల నాగేశ్వరరావు పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు …డిప్యూటీ సీఎం భట్టికి అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్నారు … సీఎం రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి…టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డితో ఏర్పడిన పరిచయాలు కొనసాగుతున్నాయి…తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయనకు దగ్గరైయ్యారు …. సీఎం , డిప్యూటీ సీఎంలు పోట్ల పేరును వ్యతిరేకించకపోవచ్చు … పైగా మంత్రి సీతక్కతో స్నేహపూర్వకంగా ఉన్నారు …జిల్లా మంత్రులు అనుకూలంగా ఉంటె పోట్లకు ఛాన్స్ దక్కవచ్చు …
అదే సందర్భంలో రాయల నాగేశ్వరరావు పేరు కూడా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ప్రచారంలో ఉంది …సౌమ్యుడు , అందరికి తలలో నాలుకలాగా ఉంటాడని పేరుంది …గతంలో ఒక వర్గానికి పరిమితమైన రాయల ఇప్పుడు అందిరితే కలుపుగోలుగా ఉంటున్నాడు ..మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలని ప్లాన్ చేసుకున్నారు …అయితే పొంగులేటి లాంటి బలమైన నేత కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వడం అనివార్యమైంది …దీంతో రాయల నాగేశ్వరరావు తప్పుకొవాల్సి వచ్చింది … మంత్రుల కుటుంబసభ్యులకు ఇవ్వకపోతే తన పేరును సిఫార్స్ చేయాలనీ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలని కలిసి కోరారు …
నిజామాబాద్ జిల్లాకు మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు చక్కర్లు కొడుతోంది ..ఆయనకు మంచి వాడు అని పేరుంది … కానీ స్థానికేతరుడు అయినందున ఆయన అభ్యర్థిత్వం పట్ల పెదవి విరుపులు ఉన్నాయి…ఖమ్మం లోకసభకు స్థానికులను పోటీ పెట్టాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి…
ఇక మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కోసం మంత్రి గట్టి పట్టు పట్టారు ..పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక సందర్బంగా ఖమ్మం ఎంపీ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు …కానీ మిగతా మంత్రులు కూడా తమ కుటుంబసభ్యుల పేర్లను తెరమీదకు తేవడంతో తనకు అన్యాయం జరుగుందని మంత్రి పొంగులేటి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది …పార్టీ పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారు …ఒక వేళ తన సోదరుడికి ఇవ్వకపోతే తన వియ్యంకుడు వరంగల్ మాజీ ఎంపీ కుమారుడైన రామసహాయం రఘుమా రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.. …ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఫైనల్ కావాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే …అప్పటివరకు ఆసక్తికర చర్చలు ,కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తారేమో చూడాలి ….