Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నేనింకా మొదలే పెట్టలేదు.. ప్రతీకారంపై ‘ఆప్ కీ అదాలత్‌’లో రేవంత్ రెడ్డి వ్యాఖ్య

  • ఇండియా టీవీ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్‌’లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
  • కేసీఆర్‌తో రాజకీయ వైరం సహా అనేక అంశాలపై స్పందించిన సీఎం
  • తన ట్రేడ్ మార్క్ పంచులతో షోను రక్తికట్టించిన రేవంత్ రెడ్డి

ఇండియా టీవీలో ప్రసారమయ్యే ప్రముఖ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్‌’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇండియా టీవీ చైర్మన్, ఎడిటర్-ఇన్-చీఫ్ రజత్ శర్మ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షోలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలు, కేసీఆర్‌తో రాజకీయ వైరం తదితర అంశాలపై తనదైన శైలిలో సూటిగా సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. నేడు రాత్రి 10.00 గంటలకు ఇండియా టీవీలో ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ షోలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణం, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు. తన రాజకీయ ప్రత్యర్థి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా? అన్న రజత్ శర్మ ప్రశ్నకు తాను ప్రతీకారం ఇంకా మొదలే పెట్టలేదని సరదాగా వ్యాఖ్యానించారు. తనదైన ట్రేడ్ మార్క్ పంచులు, డైలాగులతో రేవంత్ రెడ్డి షోను ఆద్యంతం రక్తికట్టించారు.

Related posts

హరీశ్ రావు వ్యాఖ్యలు బాధించాయి: కన్నీటి పర్యంతమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం: యూపీ సీఎం యోగి

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్… సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు…

Ram Narayana

Leave a Comment