Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక …. సంప్రదింపుల కమిటీ చైర్మన్ గా భట్టి

ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తీ కాలేదు …ఆదివారం హైద్రాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు కేసి వేణుగోపాల్ సమక్షంలో ఖమ్మం తోపాటు కరీంనగర్ , హైద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అనుకున్న అదిజరగలేదు ….ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల ప్రచార సరళి రాష్ట్రలో ఇతర పార్టీల నుంచి చేరికలు పార్టీ పనితీరుపై కేసి వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో చర్చించారు …నాయకుల పనితీరుపై అసంతృప్తి సైతం వ్యక్తం చేశారు …రాష్ట్రంలో ఇంకా ప్రకటించాల్సిన మూడు నియోజకవర్గాల్లో ఖమ్మం సీటు అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు సంప్రదింపుల కమిటీని నియమించారు …ఆ కమిటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్ గా వ్యవహరించనున్నారు …ప్రధానంగా ఖమ్మం సీటు ఎంపిక విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చైర్మన్ హోదాలో భట్టి సంబంధిత నాయకులు, మంత్రులతో సంప్రదించి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది … జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి తుమ్మలతోపాటు రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటిని సంప్రదించిన తర్వాత అభ్యర్థిపై అందరు కల్సి ఒక నిర్ణయానికి వచ్చి అధిష్టానానికి తెలియజేస్తే వారు అక్కడ నుంచి అభ్యర్థి పేరు ప్రకటిస్తారు …

నామినేషన్లు వేసేందుకు ఈనెల 18 న నోటిఫికేషన్ విడుదల కానున్నది … సమయం తక్కువ ఉండటంతో అభ్యర్థి ఎంపిక పై తొందరగా ఒక నిర్ణయానికి రావాలని అందుకు సంప్రదింపుల వ్యవహారం స్పీడ్ అప్ చేయాలనీ కేసి వేణుగోపాల్ అన్నట్లు సమాచారం …హైద్రాబాద్ , కరీంనగర్ పై ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది … కాంగ్రెస్ సునాయాసంగా గెలిచే ఖమ్మం లోకసభకు అభ్యర్థి ఎంపిక తాత్సారం చేయడంపై పార్టీ కార్యకర్తలలో నిరాశ నిస్ప్రహలు బయలు దేరాయి… కాంగ్రెస్ కు ఓటు వేద్దామని అనుకునే వాళ్లలో కూడా అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంపై గుర్రుగా ఉన్నారు …కాంగ్రెస్ పార్టీ ఇంతేలే అనే అభిప్రాయాలు సామాన్య ఓటర్ల నుంచి వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి ….

తాజా సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు , పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి , వియ్యంకుడు రఘుమారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి…మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ,జట్టి కుసుమ కుమార్ ,మల్లు నందిని ,తుమ్మల యుగంధర్ పేర్లు వచ్చిన వాటిని పక్కన పెట్టారని విశ్వసనీయ సమాచారం …

తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న పొంగులేటి …

అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది ….మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్స్ ఇవ్వడంలేదని అధిష్టానం స్పష్టం చేసినప్పటికీ పార్టీలో చేరేటప్పుడు తనకు ఇచ్చిన హామీ మేరకు టికెట్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి కోరుతున్నారు …ఈవిషయంలో అధిష్టానం వద్ద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారని సమాచారం …అధిష్టానం స్ఫష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది …అన్నమాటలకు కట్టు బడకపోతే ఎలా …మీరే ఆలోచించుకోండని తన నిరసన గళాన్ని వినిపించారని వినికిడి …దీంతో అధిష్టానం తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం….ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అభిప్రాయాలు అధిష్టానం తెలుసుకుంది …

మళ్ళీ తెరపైకి పొంగులేటి ప్రసాద్ రెడ్డి , రఘుమారెడ్డి

అయితే ఇంతకూ ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీచేస్తారు …? కాదు కాదు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే ఆసక్తి నెలకొన్నది …ఎవరిని చేసిన స్థానిక నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఇటు పార్టీ శ్రేణుల నుంచి అటు ప్రజల నుంచి వస్తుంది …అందువల్ల ఖమ్మం కు చెందిన రాయల నాగేశ్వరరావు , పోట్ల నాగేశ్వరరావు , పొంగులేటి ప్రసాద్ రెడ్డి, లేదా రామసహాయం రఘుమారెడ్డి లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తుంది … అయితే రఘుమారెడ్డి ఖమ్మం జిల్లా కాదనే అభిప్రాయాలు ఉన్న వారి పూర్వికులు కూసుమంచి మండలంలోని చేగొమ్మకు చెందినవారు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం …ఆయన తండ్రి సురేందర్ రెడ్డి రెండు పర్యాయాలు వరంగల్ ఎంపీ గా ఎన్నికైయ్యారు . ఎవరిని ఎంపిక చేయాలన్న మంత్రులతో ,జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయానికి తీసుకొని వచ్చే భాద్యతను డిప్యూటీ సీఎం కు అప్పగించడం కీలకంగా మారింది …

Related posts

అమిత్ షాను విసిగించిన హర్యానా హోం మంత్రి!

Drukpadam

తిరుపతి రైల్వే స్టేషన్‌ నమూనాపై ఆగ్రహం..

Drukpadam

త‌మిళ‌నాడులో కొత్త ప‌థ‌కం.. యాక్సిడెంట్ బాధితుల‌కు సాయం చేస్తే రివార్డు!

Drukpadam

Leave a Comment