Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

భద్రాద్రి రాముడికి ఎన్నికల కోడ్….

ప్రతి ఏటా భద్రాద్రి శ్రీసీతారామ కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయటం ఆనవాయితీ …సంవత్సరాలుగా నేరుగా ఆకాశవాణిలో ప్రసారాలు ఉండేవి …వాటిని శ్రోతలు భక్తి శ్రద్దలతో వినేవారు …టీవీ లు ప్రత్యక్ష ప్రసారాలు వచ్చిన తర్వాత నేరుగా భద్రాచలం నుంచి అక్కడ జరుగుతున్న కళ్యాణతంతును నేరుగా చూసేవారు … ఇప్పుడు దేశవ్యాపితంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నందున ప్రత్యక్షప్రసారం చేయరాదని ఎన్నికల సంఘం నిర్ణయించింది .. దీంతో భక్తుల్లో అసంతృప్తి పెరుగుతుంది … నిరసన వ్యక్తం చేస్తున్నారు …ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడలేదు …అయినప్పటికీ ప్రత్యక్షప్రసారాలు నిలిపివేయడంపై పునరాలోచన చేయాలనే డిమాండ్ పెరుగుతుంది …అసలు దేవుడికి ఎన్నికల కోడ్ ఏమిటి విడ్డురం కాకపోతే అని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి …

ప్రతిసంవత్సరం జరిగే ఈ తంతుకి నిబంధనలు ఏమిటి అంటున్నారు భక్తులు ప్రత్యక్షప్రసారానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అనుమతి కోరుతూ రాష్ట్ర పర్యాటక దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు .. రాజకీయ పార్టీలు పెద్ద సభలు పెట్టుకుంటున్నాయి…వాటికీ ముందస్తు పర్మిషన్ తో అనుమతి ఇస్తున్నారు ..వాటిని టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి..వాటికీ లేని అడ్డంకులు దేవుడి పెళ్ళికి ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి… దక్షణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి రాముడికి ఎంతో గొప్ప విశిష్టత ఉంది … తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు …అంతే కాకుండా ప్రపంచ వ్యాపితంగా ఉన్న తెలుగు ప్రజలు శ్రీ సీతారాముల కళ్యాణం అంటే భద్రాచలంలో జరిగే కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో తిలకిస్తారు …ఊరువాడా అనే తేడా లేకుండా శ్రీ సీతారాముల కళ్యాణం అంటే లోకకల్యాణం అని నమ్మకంతో నిర్వహిస్తారు …అదికూడా భద్రాచలంలో తలంబ్రాలు పడుతున్నాయంటే తమ దగ్గర కూడా అదే సమయంలో అభిజిత్ లగ్నంలో కళ్యాణం నిర్వహిస్తారు …అందుకే శ్రీసీతారాముల కళ్యాణం చూతుము రారండి అంటూ కళ్యాణ మంటపాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి…ఇంతటి విశిష్టత ఉన్న ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఎన్నికల కోడ్ పేరుతో నిలపడం అభ్యంతరకరమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి…

Related posts

హైదరాబాద్‌ ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు.. వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సన్నాహాలు!

Ram Narayana

ఫెంగల్ తుపాను ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు!

Ram Narayana

కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారు: అంబటి రాంబాబు

Ram Narayana

Leave a Comment