Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి…?

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు …అయితే పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఎంపిక చేశారని ఖమ్మంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది … కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి లేదా వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డిలలో ఒకరికి టికెట్ వస్తుందని విశ్వసనీయ సమాచారం… అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని అందుకే అందరికి నచ్చచెప్పి ఐక్యంగా ముందుకు తీసుకోని పోగలిగిన సమర్థుడైన డిప్యూటీ సీఎం కు సంప్రదింపుల భాద్యత అప్పగించినట్లు తెలుస్తుంది …

అయితే కొందరు దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నారు … లేదు లేదు కమ్మ సామాజికవర్గానికే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు … కమ్మ సామాజిక వర్గకోటాలో బాగంగా రేణుకాచౌదరికి రాజ్యసణభ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు… మరికొందరు మేడం నందినికి టికెట్ అంటూ వార్తలు ట్రోల్ చేస్తున్నారు …మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడంలేదని తెలిసిన తర్వాత రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు …ఒక సందర్భంలో నేడో రేపో పోట్ల లేదా రాయలకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది …

ఖమ్మం తోపాటు కరీంనగర్ , హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక భాద్యతను అధిష్టానం తమకు దగ్గర వచ్చిన పేర్లులో కొన్నిటిని రాష్ట్ర నేతలకు అప్పగించి ఫైనల్ చేసి తమకు పంపాలని సూచించింది ….ఖమ్మం ఎంపీ టికెట్ ఎంపిక చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సంప్రదింపుల కమిటీని నియమించింది …సీఎం ,ఆయాజిల్లాల్లో మంత్రులు ఇతర ముఖ్య నేతలను కల్సి వారిని కన్విన్స్ చేసే భాద్యత ను కమిటీకి చైర్మన్ గా ఉన్న భట్టికి అధిష్టానం అప్పగించింది …దానిపై భట్టి కసరత్తు మొదలు పెట్టారు …ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థిలు ఎవరు అయితే సులువుగా గెలిచే అవకాశాలు ఉన్నాయనే దానిపై భట్టి సంప్రదింపులు జరుపుతున్నారు ….

మొదటి నుంచి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు అధిష్టానం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు …తాను మాత్రం ప్రసాద్ రెడ్డికి టికెట్ విషయంలో రాజీపడటంలేదు ….పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వాల్సిందే అని పట్టు పడుతున్నారు … పార్టీలో చేరిక సందర్భంగా ఆయనకు 10 అసెంబ్లీ , 2 లోకసభ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది …10 అసెంబ్లీలు ఇవ్వకపోగా , చివరకు ఇస్తానన్న రెండు ఎంపీ సీట్ల లో ఒకటి కూడా ఇవ్వకుండా ఉండాలనే ఆలోచనపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు …ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకోని పోయిన మంత్రి ఇక మీ ఇష్టం అన్నట్లు సమాచారం… దీంతో పునరాలోచనలో పడ్డ ఢిల్లీ , హైద్రాబాద్ నేతలు ప్రసాద్ రెడ్డికి లేదా రఘురామిరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది …పొంగులేటి మాత్రం తమ్ముడికి ఇవ్వాలని కోరుతున్నారు …రఘురామి రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది …రఘురామిరెడ్డి పోటీకి అయిష్టత చూపుతున్నారని సమాచారం …ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ కాండిడేట్ ఎవరు అనేది ఈ రోజు లేదా రేపు వెల్లడైయ్యా అవకాశం ఉంది ….

Related posts

బోగస్ పథకాలతో దళితులను మోసం చేసిన కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలి.. ప్రజాసంఘాల నేతలు

Ram Narayana

 పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి కేటీఆర్.. పోయిన బలం పెంచుకునేందుకే!

Ram Narayana

పొత్తుల విషయంలో వార్తలన్నీ ఫేక్: ఆర్​ఎస్ ప్రవీణ్

Ram Narayana

Leave a Comment