270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు మహిళ… జరిమానా లక్ష దాటింది!
- పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు మహిళ
- నగరంలోని సీసీ టీవీ కెమెరాల్లో అమ్మడి తప్పిదాల చిత్రీకరణ
- రూ.1.36 లక్షల జరిమానా విధించిన పోలీసులు
బెంగళూరులో ఓ మహిళ 270 పర్యాయాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె దాదాపు అన్ని రకాల ట్రాఫిక్ నియమాలను అతిక్రమించినట్టు వెల్లడైంది. ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ తదితర తప్పిదాలకు పాల్పడినట్టు గుర్తించారు.
దాదాపు బెంగళూరు నగరంలోని చాలా వరకు సీసీ కెమెరాల్లో అమ్మడి ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డయ్యాయట. ఇప్పటివరకు ఆ మహిళకు అనేక పర్యాయాలు నోటీసులు పంపుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఆమెపై రూ.1.36 లక్షల జరిమానా విధించినట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.