Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సొంత కారే లేదట!

  • గాంధీనగర్ నుంచి లోక్ సభ బరిలో అమిత్ షా
  • శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర మంత్రి
  • సొంత వాహనం లేదంటూ అఫిడవిట్ లో వెల్లడి

కేంద్ర హోంమంత్రి, బీజేపీలో నెంబర్ టూ నాయకుడు అమిత్ షా కు సొంత కారు లేదట.. తన పేరుతో ఎలాంటి వాహనం లేదని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈమేరకు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల లెక్కలు చెబుతూ ఈ విషయం తెలిపారు. శుక్రవారం గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థానానికి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ సహా పలువురు సీనియర్ నేతల సమక్షంలో అమిత్ షా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

ఈ పత్రాలకు జతచేసిన అఫిడవిట్ ప్రకారం.. అమిత్ షా ఆస్తుల విలువ మొత్తం రూ.36 కోట్లు. ఇందులో స్థిరాస్తులు రూ.20 కోట్లు కాగా చరాస్తులు రూ.16 కోట్లు ఉన్నాయి. రూ.72 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15.77 లక్షల రుణం ఉంది. ఇక, అమిత్ షా భార్య సోనాల్ కు రూ. 31 కోట్ల విలువైన ఆస్తులు, రూ.1.10 కోట్ల విలువైన నగలు, రూ. 26.32 లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. వృత్తిరీత్యా తాను రైతునని అమిత్ షా అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా అందుకునే వేతనంతో పాటు వ్యవసాయం, ఇంటి అద్దెలు, షేర్లు, డివిడెండ్ల నుంచి ఆర్జిస్తున్నట్లు వివరించారు. తనపై మూడు క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు కూడా అమిత్ షా వెల్లడించారు.

Related posts

ఖమ్మం జిల్లా ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పొన్నెకల్లు వద్ద శ్రీ చెతన్య ఇంజనీరింగ్ కాలేజీ …కలెక్టర్ విపి గౌతమ్

Ram Narayana

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల జాతర…చెదురు మదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం …

Ram Narayana

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు

Ram Narayana

Leave a Comment