Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ముఖ్యమంత్రి గారూ… మీ ఇద్దరూ ఇక బ్యాండేజీలు తీసేయండి: వర్ల రామయ్య…

  • ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో రాయి దాడి
  • సీఎం జగన్ నుదుటికి గాయం… మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి గాయం
  • జగన్ గాయానికి మూడు రోజులు బ్యాండేజి చాలన్న వర్ల రామయ్య
  • వెల్లంపల్లి కంటి దెబ్బకు రెండున్నర రోజులు బ్యాండేజి చాలని వెల్లడి

ఇటీవల విజయవాడలో సీఎం జగన్ పై విజయవాడలో రాయి దాడి జరగడం, ఆయన నుదుటికి గాయం కావడం తెలిసిందే. ఏప్రిల్ 13న ఈ ఘటన జరగ్గా, సీఎం జగన్ ఇంకా నుదుటన బ్యాండేజితోనే దర్శనమిస్తున్నారు. ఇదే ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి కూడా గాయం కావడంతో, ఆయన కూడా బ్యాండేజి వేయించుకున్నట్టు ఫొటోలు బయటికి వచ్చాయి. 

ఈ అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. “ముఖ్యమంత్రి గారూ… మీరు, మీ అనుచరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మీ మీ బ్యాండేజిలు తీసేయండి. మీ నుదుటి దెబ్బకు మూడు రోజుల బ్యాండేజి చాలు. వెల్లంపల్లి కంటి దెబ్బకు రెండున్నర రోజులు చాలు. వెల్లంపల్లి కంటి బ్యాండేజి వెంటనే తీయకుండా ఎన్నికల దాకా ఉంచుకుంటే మొదటికే మోసం… గ్రహించగలరు” అంటూ ట్వీట్ చేశారు.

Related posts

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్…

Ram Narayana

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ…

Ram Narayana

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకావడంపై నేడు టీడీపీ నిర్ణయం

Ram Narayana

Leave a Comment