Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా త్రీబుల్ ఆర్ …?

ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా త్రీబుల్ ఆర్ పేరు దాదాపు ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం … త్రీబుల్ ఆర్ అంటే ఎవరు అని అనుకుంటున్నారా …? ఆయనేనండీ రామసహాయం రఘురామిరెడ్డి …సీనియర్ కాంగ్రెస్ నేత వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు …మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు …సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ కి కూడా రఘురాం రెడ్డి వియ్యంకుడే కావడం విశేషం …దీంతో అటు రెడ్డి ఇటు కమ్మ సామాజికవర్గంతో ఆయనకు బంధుత్వాలు ఉండటం అదనపు అర్హతగా ఉంది … ఆ కుటుంబానికి ఖమ్మం జిల్లాతో దశాబ్దాలుగా విడదీయరాని సంబంధం ఉంది… కూసుమంచి మండలం చేగొమ్మ ,ముత్యాలగూడెం గ్రామాల్లో వారికీ ఇళ్ళు, భూములు ఉండేవి..తిరుమలాయపాలెం మండలంలో బంధువులు బంధుత్వాలు ఉన్నాయి …ఖమ్మంలో ఆస్తులు ఉన్నాయి …కాలక్రమంలో వారు ఇక్కడ సొంత స్థలాలను ఇళ్లను గ్రామా అవసరాలు స్కూల్స్, పంచాయతీ భవనాల కోసం దానం ఇచ్చారు … వారిది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం …ఎవరెన్ని పార్టీలు మారిన వారు పార్టీలు మారకపోవడం వారికీ కలిసొచ్చిన అంశం …

నామినేషన్లు దాఖలు చేసేందుకు మరో మూడు రోజులే ఉండటం…ఖమ్మం సీటు విషయంలో మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎంపిక ఆలస్యం అయింది …అనేక సార్లు ఢిల్లీలో అధిష్టానం పెద్దలవద్ద ఎవరికీ టికెట్ ఇవ్వాలనే అంశంపై తర్జనభర్జనలు జరిగాయి…అయినా ఒక నిర్ణయానికి రాలేక పోయారు … చివరకు ఖమ్మం పంచాయతీని తేల్చే విషయాన్నీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించారు … అభ్యర్థి ఎంపిక విషయం తేల్చేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను రమ్మని బెంగుళూరులో ఉన్న ఖర్గే దగ్గర నుంచి కబురు రావడంతో వారు సోమవారం తెల్లవారుజామున హుటాహుటిన బయలుదేరి అక్కడకు వెళ్లి ఆయన్ను కలిశారు …వారితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవరాల ఇంచార్జి మున్షి కూడా వెళ్లారు …వారితో సమావేశమైన ఖర్గే వారి అభిప్రాయాలు తెలుసుకొని తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పినట్లు సమాచారం … ఒక సందర్భంలో మంత్రులు తమవారికి టికెట్స్ ఇవ్వాలని పట్టుబట్టడంపై ఖర్గే ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది …దీంతో తమ అభిప్రాయాలు చెప్పిన మంత్రులు బెంగుళూరు నుంచి హైద్రాబాద్ చేరుకున్నారు …ఈరోజు సాయంత్రం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి …నిన్న మొన్న వినిపించిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కకు పెట్టినట్లు సమాచారం …మండవ విషయంలో మంత్రులు ఒకే అభిప్రాయంతో ఉన్నారని వినికిడి …లోకల్ – నాన్ లోకల్ సమస్య వచ్చినప్పుడు జిల్లాతో ఎలాంటి సంబంధం లేని మండవ వెంకటేశ్వరరావు ను ఎంపిక చేస్తున్నారనే విషయం బయటకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి…దీంతో ఆయన పేరు పక్కకు పెట్టారని తెలుస్తుంది …ఇక మంత్రుల కుటుంబసభ్యులకు అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామసహాయం రఘురామిరెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం ….!

Related posts

చెప్పుతో కొడతాం… వెళ్లిపోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Ram Narayana

వ్రతం చెడ్డా ఫలితం దక్కని జలగం వెంకట్రావు …!

Ram Narayana

 గత పాలకులు అప్పులు ఎక్కువగా చేసినా ఫలితం దక్కలేదు… అందుకే అవసరం మేర ఖర్చులు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

Leave a Comment