Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

బెంగాల్ లో 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు…

  • రిక్రూట్ మెంట్ చట్ట విరుద్ధమని ప్రకటన 
  • ఆ ఉద్యోగులంతా 6 వారాల్లోగా వడ్డీ సహా జీతాలు తిరిగిచ్చేయాలని ఆదేశం
  • 15 రోజుల్లోగా కొత్త రిక్రూట్ మెంట్ మొదలుపెట్టాలని స్పష్టీకరణ

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్ మెంట్లను రద్దు చేసింది. ఆ టీచర్లంతా ఆరు వారాల్లోగా వారు పొందిన జీతాలను 12 శాతం వడ్డీతో వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. 

క్యాన్సర్ తో బాధపడుతున్న సోమా దాస్ అనే వ్యక్తికి మాత్రం మినహాయింపు ఇచ్చి ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే కొత్త టీచర్ల నియామకాల ప్రక్రియను 15 రోజుల్లోగా చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ దెబాంగ్సు బాసక్, మొహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుతో గ్రూప్ సీ, డీతోపాటు 9, 10, 11, 12 తరగతుల టీచర్లకు చెందిన సుమారు 24 వేల ఉద్యోగాలు రద్దయ్యాయి.

అసలు ఏం జరిగిందంటే..?
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న 24, 640 టీచర్ పోస్టుల భర్తీకి 2016లో రాష్ర్ట స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించింది. అయితే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని.. అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశంతో హైకోర్టు విచారణ ప్రారంభించింది. కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ ఈ స్కాంలో పాత్ర ఉందంటూ 2022లో నాటి విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీతోపాటు బెంగాల్ స్కూల్ సర్వీసు కమిషన్ లో పనిచేసిన కొందరు అధికారులను అరెస్టు చేసింది. పార్థా చటర్జీకి ప్రధాన అనుచరురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన కోల్ కతా నివాసాన్ని సీబీఐ తనికీ చేయగా రూ. 21 కోట్ల నగదు, రూ. కోటికిపైగా విలువ చేసే నగలు లభించాయి. ఈ కేసులో సీబీఐ తమ దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది.

8 ఏళ్ల శాలరీని 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యం?: 25వేల ఉద్యోగాల రద్దుపై మమతా బెనర్జీ

  • కోర్టు తీర్పును సవాల్ చేస్తామన్న ముఖ్యమంత్రి
  • 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న హైకోర్టు
  • 25వేలకు పైగా నియామకాలను రద్దు చేయడంతో పాటు 8 ఏళ్ల శాలరీని 12 శాతం వడ్డీతో చెల్లించాలన్న కోర్టు
  • ఉద్యోగాలు పోయిన వారికి అండగా నిలబడతామని మమత హామీ
Mamata Banerjee calls verdict illegal

25వేల మంది టీచర్లు… తమ 8 ఏళ్ల శాలరీని నాలుగు వారాల్లో తిరిగి ఇచ్చేయాలన్న హైకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యం? అని వాపోయారు. 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని చెబుతూ హైకోర్టు 25వేలకు పైగా ఉద్యోగుల నియామకాన్ని రద్దు చేసింది. అంతేకాదు, ఈ వేతనాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడవద్దని చెప్పారు. కొందరు బీజేపీ వారు న్యాయమూర్తులను, న్యాయవాదులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

Related posts

ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఒక్కటే.. రాహుల్ ఆరోపణలు!

Drukpadam

విపక్ష కూటమికి ఇండియా పేరు సూచించిన మమతా …!

Drukpadam

కర్ణాటక ఫలితాలపై ప్రియాంక గాంధీ ,మమతా బెనర్జీ స్పందనలు …

Drukpadam

Leave a Comment