Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి తరుపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలు …

నామినేషన్లు వేసేందుకు మరో రోజు మాత్రమే ఉంది …ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు …ఎవరిని ప్రకటిస్తారని ఉత్కంఠ …ఇందులో కులాలు లెక్కలు …ఎవరు అభ్యర్థి అనే చర్చలు …ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు , చివరగా బెంగుళూరుకు పరుగులు అక్కడ ఏఐసీసీ వద్ద ఎవరి వాదనలు వారివి … సామజిక వర్గాల పొందికలు …కమ్మ సామాజికవర్గానికి చెందిన మండవ వెంకటేశ్వరరావును అభ్యర్థిగా తీసుకోని రావాలనే ప్రయత్నాలు …దానిపై నాన్ లోకల్ -లోకల్ అనే వాదనలు మండవ వెంకటేశ్వరరావు అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచే వస్తున్న వ్యతిరేకతతో వెనక్కు తగ్గిన వైనం ..ఇక కమ్మ సామజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు , ప్రముఖ కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు పేర్లు ఏఐసీసీ దాక వెళ్లాయి…మల్లు నందిని , పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు చివర దాక వినిపించాయి…జిల్లా మంత్రుల మధ్య ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు …డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఏఐసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు బెంగుళూరు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు …బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తో సమావేశం ముగిసిన తరువాత భట్టి ఒడిశా ఎన్నికల ప్రచారానికి వెళ్లగా , మంత్రి పొంగులేటి హైద్రాబాద్ చేరుకున్నారు …అక్కడ జరిగిన చర్చల్లో రఘురాంరెడ్డి …రాయల నాగేశ్వరరావు పేర్లు పరిశీలనకు వచ్చాయని వార్తలు ట్రోల్ అయ్యాయి… రఘురాంరెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయిందని ప్రచారం జరిగింది … దీంతో మంగళవారం రఘురాంరెడ్డి తరుపున పొంగులేటి అనుయాయులు ఖమ్మం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారికి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు …

దీనిపై కాంగ్రెస్ లోనే అయోమయం నెలకొన్నది …నిజంగా రఘురాంరెడ్డికి టికెట్ ఇచ్చారా ..? ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా ..? లేకపోతె ఆయన తరుపున రెండు సెట్ల నామినేషన్లు ఎందుకు వేస్తారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది … కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ప్రకటించకుండానే నామినేషన్ వేశారు ..మంత్రి పొన్నం పాల్గొన్నారు … పార్టీ నుంచి డైరక్షన్ ఉన్నందునే తను పాల్గొన్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు …ఖమ్మంలో మాత్రం మంత్రులు , ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు ఎవరు పాల్గొనలేదు …పొంగులేటి అనుయాయులుగా ఉన్న మద్దినేని బేబీ స్వర్ణకుమారి ,బొర్రా రాజశేఖర్ , నిరంజన్ రెడ్డి , స్వామి రమేష్ , జొన్నల గడ్డ రవి ,ముస్తఫా , మహబూబాబాద్ జిల్లాకు చెందిన నూకల నరేష్ రెడ్డిలు మాత్రమే రఘురాం రెడ్డి తరుపున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు …

మరో వాదన కూడా ఉంది …రఘురాం రెడ్డి పేరు పరిశీలనలో ఉన్న మాట నిజమే …దానితోపాటు రాయల నాగేశ్వరరావు పేరు కూడా ఉంది …ఏఐసీసీ దగ్గర రెండు పేర్లు ఉన్నాయి…మంత్రి తుమ్మల అభిప్రాయం కూడా ఏఐసీసీ అధ్యక్షులు తీసుకున్నారు …ఆయన ఎవరిని ఎంపిక చేసిన పార్టీ నిర్ణయాన్ని గౌరవించి వారి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు …అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠతతో ఖమ్మం లోకసభ ఓటర్లు ఎదురు చూస్తున్నారు చూద్దాం ఏమి జరుగుతుందో ….!

Related posts

తెలంగాణ మీ కుటుంబమైతే దళితుడిని సీఎం ఎందుకు చేయలేదు..? : బండి సంజయ్

Ram Narayana

బీజేపీలోనే ఉండటమా? కాంగ్రెస్‌లోకి వెళ్లడమా?: నేడు వివేక్, రాజగోపాల్ రెడ్డి భేటీ

Ram Narayana

ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు …పార్టీకి గుడ్ బై చెపుతున్న ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు

Ram Narayana

Leave a Comment