Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఆనందయ్య కరోనా మందు పంపిణీపై కొత్త ట్విస్ట్ …. ప్రభుత్వం సహకరించాలి….

ఆనందయ్య కరోనా మందు పంపిణీపై కొత్త ట్విస్ట్ …. ప్రభుత్వం సహకరించాలి
-ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తేనే మందు పంపిణి సాధ్యమవుతుంది:
-ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు వ్యాఖ్య
-ఆనందయ్యకు ఏపీ ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేదు
-కృష్ణపట్నంలో ప్రస్తుతం సెక్షన్ 144 అమలు చేస్తున్నారు
-ఆన్ లైన్ ద్వారా మందును సరఫరా చేయడం కుదరదు
ఆనందయ్య కరోనా మందు పంపిణి పై రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుందనేది ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది. ఆనందయ్య మందుపై నానాయాగీ చేసిన ప్రభుత్వం చివరకు పంపిణి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ….. జిల్లా కలెక్టర్ తో సహా అందరు మందు పంపిణీపై ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు . ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించటంలేదని అంటున్నారు. పైగా ఆన్ లైన్ ఆర్డర్ చేయడం జరిగే పనికాదని నిర్వాహకులు చెబుతున్నారు. రోజుకు కేవలం ఐదు వేలమందికి మాత్రమే మందు పంపిణి చేయగలమని కానీ ప్రభుత్వ ప్రకటనతో లక్షలమంది తమకు మందు కావాలని కోరుతున్నారని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని మందు పంపిణీకి సహకరించాలని కోరుతున్నారు. …..
కరోనాకు ఆనందయ్య తయారు చేసిన నాటు మందు యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది. ఆనందయ్యకు అండగా ఉంటామని వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా చెప్పారు. అయితే ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం వైపు నుంచి తగిన సహకారం లేదని ఆయన అన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక ఆనందయ్య కంటతడి పెట్టుకుంటున్నారని చెప్పారు.

కృష్ణపట్నంలో ప్రస్తుతం సెక్షన్ 144 అమలు చేస్తున్నారని తెలిపారు. మందు పంపిణీ జరగదని… దయచేసి ఎవరూ రావద్దని ప్రజలకు విన్నవించారు. ఆనందయ్య రోజుకు కేవలం 5 వేల మందికి సరిపడా మందును మాత్రమే తయారు చేయగలరని చెప్పారు. జిల్లాల వారీగా లక్షల మందికి మందును సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా మందును సరఫరా చేయడం కుదిరేపని కాదని స్పష్టం చేశారు.

Related posts

ఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్…మాస్క్ మస్ట్ లేకపోతె రూ 1000 ఫైన్ …తెలంగాణ సర్కార్!

Drukpadam

అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం!

Drukpadam

ప్రజల ప్రాణాలకన్నా ప్రచారానికే మోడీ ప్రాధాన్యత …. ప్రియాంక మండిపాటు

Drukpadam

Leave a Comment