లోకసభ సాధారణ ఎన్నికలు-2024 దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గానికి సంబందించిన ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లైతే తనకు తెలియజేయాలని సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డా. సంజయ్ గేండ్రాజ్ కోల్టే, ఐ.ఏ.ఎస్. తెలిపారు. గురువారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఒక ప్రకటనలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘనలు, ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లైతే, వాటిని స్వయంగా స్వీకరించడానికి సాయంత్రం 4.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఖమ్మం లోని ఆఫీసర్స్ గెస్ట్ హౌజ్ లో (ఎన్ఎస్పి గెస్ట్ హౌజ్) అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. అదే విధంగా ఫోన్ నెంబర్ 9346293006 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, తనకు వచ్చే ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయదలచిన వారు స్వయంగా గాని లేదా ఫోన్ ద్వారా గాని ఫిర్యాదులు చేయవచ్చని ఆయన తెలిపారు.

previous post