Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

  • రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షా ఫేక్ వీడియో వైరల్‌గా మారిందని బీజేపీ ఫిర్యాదు
  • కాంగ్రెస్ నేతలే ఆ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని ఫిర్యాదు
  • పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్‌కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేశారు.

ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy responds on Delhi police notices

అమిత్ షా ఫేక్ వీడియో అంశంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ బీజేపీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో బీజేపీని ఓడించి తీరుతామని సవాల్ చేశారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీని ప్రశ్నించినందువల్లే తనకు, తనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. నాకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ విపక్షాలపై ఈడీ, సీబీఐని ప్రయోగించారని… ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా ప్రయోగిస్తున్నారన్నారు. 

మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, రేపు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నామన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికే బీజేపీ 400 సీట్లను అడుగుతోందని ఆరోపించారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Related posts

పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో స్కూళ్లకు సెలవు

Ram Narayana

ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు

Ram Narayana

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్ లాల్!

Ram Narayana

Leave a Comment