Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో 65 ఏళ్లు నిండిన అంగ‌న్‌వాడీ సిబ్బందికి విశ్రాంతి…

  • అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ప‌నిచేసే సిబ్బంది ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 65 ఏళ్లుగా నిర్ణ‌యించిన‌ తెలంగాణ స‌ర్కార్‌
  • రిటైర్మెంట్ అయిన అంగ‌న్‌వాడీ సిబ్బందికి ఆస‌రా పింఛ‌న్ల మంజూరు 
  • సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోన‌ఫైడ్ స‌ర్టిఫికేట్ లేదా మార్కుల మెమో ప్ర‌కారం గుర్తించాల‌న్న‌ శిశు సంక్షేమ‌శాఖ

అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ప‌నిచేసే 65 ఏళ్లు నిండిన సిబ్బంది విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వీరి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. సంబంధిత వివ‌రాల‌ను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పంపించాల్సిందిగా మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ డైరెక్ట‌ర్ కాంతివెస్లీ సోమ‌వారం ఆదేశించారు. 

ఇక రిటైర్ అయిన అంగ‌న్‌వాడీ సిబ్బందికి ఆస‌రా పింఛ‌న్లు మంజూరు చేస్తామ‌న్నారు. సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోన‌ఫైడ్ స‌ర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్ర‌కారం గుర్తించాల‌ని శిశు సంక్షేమ‌శాఖ సూచించింది. ఒక‌వేళ ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక గానీ, వైద్య‌ధ్రువీక‌ర‌ణ ప‌త్రం గానీ ఇవ్వాల‌ని వెల్ల‌డించింది. 

కాగా, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందే అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు రూ. ల‌క్ష‌, అలాగే మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, స‌హాయ‌కుల‌కు రూ. 50 వేల చొప్పున ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాల రూపంలో ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.   

Related posts

రెండో విడత పంటరుణాల మాఫీ నిధుల విడుదల… లబ్ధిదారుల్లో చివరి స్థానంలో హైదరాబాద్

Ram Narayana

యూపీఐ యాప్‌లపై తెలంగాణ విద్యుత్ బిల్లుల చెల్లింపుల బంద్…

Ram Narayana

జర్నలిస్ట్ కు రూ.10వేల ఆర్ధికసహాయం అందజేసిన కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్…

Ram Narayana

Leave a Comment