Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో కాంగ్రెస్ , బీఆర్ యస్ , బీజేపీ మధ్య తీవ్ర పోటీ

టెంపరేచర్ 45 డిగ్రీల పైమాటే …భానుడి భగభగలు ,నిప్పుల కొలిమిలా ఉన్న ఉష్ణోగ్రతలు …బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న సందర్భం … అయినప్పటికీ జరుగుతున్న జనరల్ ఎన్నికలు … ఏసీలలో కూర్చోవాల్సిన నాయకులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విఫరీతమైన ఎండల్లో చెమటలు కక్కుతున్నారు …ప్రత్యేకించి కాంగ్రెస్ కంచుకోట , కమ్యూనిస్టుల గుమ్మంగా చెప్పబడుతున్న ఖమ్మంలో బీజేపీ కూడా పోటీలోకి వచ్చింది …ఆపార్టీ జాతీయనేతలు ఇప్పటికే తమకు ఉనికి ఏ మాత్రంలేని ఖమ్మంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు …బీజేపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు …రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొత్తగూడం లో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు …బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జిల్లాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు …బీజేపీ జాతీయనాయకులు తమిళనాడు , కర్ణాటక కో -ఇంచార్జి ,తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తన సొంత జిల్లా అయిన ఖమ్మంలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు .. అభ్యర్థి వినోద్ రావు తరుపున భార్య కుమారుడు , కూతురు ప్రచారం నిర్వహిస్తున్నారు …గతంలో ఎన్నడూ బీజేపీ అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భంలేదు …ప్రత్యేకంగా ఒక పెద్ద క్యాంపు ఆఫీస్ ,యంత్రాంగం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారు .. మోడీ గాలి , అయోధ్యలో రామమందిర నిర్మాణంతో తనకు కలిసి వస్తుందని వినోద్ రావు నమ్ముతున్నారు ..

బీఆర్ యస్ అభ్యర్థిగా తిరిగి పోటీచేస్తున్న లోకసభలో ఆపార్టీ పక్ష నేత నామ నాగేశ్వరరావు ప్రచారం జోరుగా సాగుతుంది …పాతకాపు అయిన నామ తన శక్తి యుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు ..ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు …. బీఆర్ యస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మంలో ఏప్రిల్ 29 ,30 తేదీల్లో పర్యటించి పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు …రోడ్ షో ద్వారా పార్టీ క్యాడర్ లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించే ప్రయత్నం చేశారు …ఖమ్మం కొత్తగూడెంలలో జరిగిన కార్నర్ సభల్లో పాల్గొన్నారు …ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలపై విమర్శలు గుప్పించారు …ఇక్కడ పోటీచేస్తున్న బీఆర్ యస్ అభ్యర్థి గెలిస్తే వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిని చేస్తానని అన్నారు …తమ పార్టీకి రాష్ట్రంలో 12 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయని ప్రకటించారు …నామ ప్రచారంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెఎన్కటవీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి , బానోత్ మదన్ లాల్ , వనమా వెంకటేశ్వరరావు , మెచ్చా నాగేశ్వరావు , రేగా కాంతారావు ,తాటి వెంకటేశ్వర్లు ,ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ పూనుకొల్లు నీరజ పాల్గొంటున్నారు …కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు , వాగ్దానాలు అమలు చేయలేదని అందువల్ల ప్రజల్లో మార్పు వచ్చిందని ఓటర్లు తమను ఆదరిస్తారని అభ్యర్థి నామ నాగేశ్వరరావు విశ్వాసంతో ఉన్నారు …

కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి టికెట్ ప్రకటించడం ఆలస్యం అయినప్పటికీ ప్రచారం లో దూకుడు కనిపిస్తుంది …జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకోని పనిచేస్తున్నారు …డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు … ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నారు …ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు …మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు , రాందాస్ నాయక్ , మట్టా రాగమయి, జారే ఆదినారాయణ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ,నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరరావు , మువ్వా విజయ్ బాబు , పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తదితరులు పాల్గొంటున్నారు … ఈనెల 4 న కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జరిగే బహిరంగసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు …అదే విధంగా రఘురాంరెడ్డి వియ్యంకుడు సినీహీరో వెంకటేష్ ఈనెల 7 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు …ఇప్పటికే మంత్రి పొంగులేటి సతీమణి మాధురి ,వెంకటేష్ కూతురు, రఘురాంరెడ్డి కోడలు ,కొడుకు అర్జున్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు …

రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులకు సిపిఐ , సిపిఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి..సిపిఎం మాత్రం ఒక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తన అభ్యర్థిని రంగంలోకి దించడంతో అక్కడ మినహా మిగతా 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుంది …దీంతో జిల్లాలో రెండు పార్టీల ఓట్లు తమకు అనుకూలంగా ఉండటం , పార్టీ అధికారంలో ఉండటం ,జిల్లాలో ముగ్గురు మంత్రుల ప్రచారం వెరసి తన గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు ….

Related posts

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

Ram Narayana

పొంగులేటి అభినందనలు …ప్రజాతీర్పును గౌరవిస్తున్నా…కందాల ఉపేందర్ రెడ్డి!

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ లో నయా జోష్ …ఒకే వేదికపై భట్టి ,తుమ్మల ,పొంగులేటి

Ram Narayana

Leave a Comment