Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఆదరించండి …ఆధార్ పార్టీ అధ్యక్షులు ఈడా శేషగిరి రావు …

ఖమ్మం , నల్గొండ , వరంగల్ పట్టభద్రుల స్థానానికి మే 27 న జరుగుతున్న ఎన్నికల్లో తనను ఆదరించి ఓట్లు వేయాలని ఆధార్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు పట్టభద్రులు అభ్యర్ధించారు …బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే పట్టభద్రుల సమస్యలను శానమండలిలో ప్రస్తహిస్తానని అన్నారు …నిరుద్యోగుల తరుపున తన గొంతు వినిపిస్తానని , పేదల తరుపున , ప్రజావాణి వినిపించి వారికీ మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నారు ..

నేను ఖమ్మం జిల్లా వాసిని …

తాను ఖమ్మం జిల్లా పెనుబల్లి తుమ్మలపల్లి గ్రామంలో జన్మించానని అన్నారు . రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంతో పాటు తండ్రి స్వాతంత్య్ర సమరయోదులుగా , తల్లి సర్పంచ్ గా, జెట్పిటిసి సభ్యురాలిగా పనిచేసారు . ఉన్నత విద్యావంతుడుగా ఎంఎస్సి జెనెటిక్స్ , ఎల్ఎల్ఎం పూర్తి చేసి పార్టీ పిరాయింపుల చట్టం మీద పిహెచ్ డి పట్టా పొందారు . స్వాతంత్య్ర బావాలు కలిగిన శేషగిరి రావు ప్రతినిత్యం సమాజానికి ఉపయోగపడే విధంగా స్వచ్చంద సంస్తల ద్వారా ఎంతో మంది పేదలకు సేవ చేయడంతో పాటు నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక సహాయం ప్రకటించేవారు . 1999 లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసారు . 2022 లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో సైతం పోటీ చేసారు . గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయవాదుల సంఘం సెక్రెటరీగా గవర్నమెంటు తరపున హైకోర్టు న్యాయవాదిగా పని చేసారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గోప సంఘంలో రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసారు . రాష్ట్ర గౌడ సంఘాల సమన్వయ సంఘం గౌరవ చైర్మన్ గా గౌడల ఐక్యతే ధ్యేయంగా జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో ఉన్న గౌడ ప్రముఖులందరిని ఏకం చేసి గౌడ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు . ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయవాదిగా పని చేస్తూ బిసి, ఎస్సి, ఎస్టి మైనార్టీ ప్రజల ikyata కోసం జాతీయ స్థాయిలో ఆధార్ పార్టీ స్థాపించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 43 స్తానాలలో ఆధార్ పార్టీ తరపున అభ్యర్థులను నిలిపి 63 వేల ఓట్లను సాధించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు . తెలంగాణలో మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఆధార్ పార్టీ తరపున 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపారు . రాబోయే పట్టభద్రుల ఎన్నికలలో విద్యావేత్తలను , మేధావులను శాసనమండలికి పంపాలని ఆయన కోరారు . వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, నీతి నిజాయితీపరునిగా మంచి పేరు ఉండడంతో ఈడా శేషగిరి రావు గౌడ్ అభ్యర్థిత్వాన్ని పలువురు బలపరుస్తున్నారు . ఈ కార్యక్రమంలో పిల్లి సుదర్శన్గారు , ఖమ్మం ఎంపి అభ్యర్థి కుక్కల నాగయ్య గౌడ్ , మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు శామ్లా నాయక్ , హైద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జమీల్ మరియు గద్దల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

ప్రేమతోనే అలా చేశా, మరో ఉద్దేశం లేదు: హోం మంత్రి మహమూద్ అలీ

Ram Narayana

ముత్యాల జలపాతం అడవుల్లో చిక్కుకున్న 84 మంది టూరిస్ట్‌లు!

Ram Narayana

తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్!

Ram Narayana

Leave a Comment