Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైకోర్టు వార్తలు

వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

  • అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరణ
  • ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు
  • మరో ఇద్దరు నిందితులకు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాశ్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే దస్తగిరి వాదనను అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపలేదని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. దస్తగిరి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. 

మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన అవినాశ్ రెడ్డి తండ్రి వై ఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో ఇద్దరు నిందితులైన ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.

Related posts

అలా అయితే భారత్ నుంచి నిష్క్రమిస్తాం.. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టీకరణ…

Ram Narayana

హిందూ వివాహంలో కన్యాదానం తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం…

Ram Narayana

Leave a Comment