Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు

  • మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు… ఇవ్వకపోవచ్చు కానీ పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీంకోర్టు
  • బెయిల్ పిటిషన్‌పై మే 7న వాదనలు వింటామన్న న్యాయస్థానం
  • విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం

ఢిల్లీ మద్యం పాలసీ అంశానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్‌పై మే 7న వాదనలు వింటామని తెలిపింది. తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రికి మధ్యంతర బెయిల్‌కు అవకాశముందని… అయితే తదుపరి తేదీనే (మే 7న) విచారణ ముగుస్తుందని చెప్పలేమని పేర్కొంది. విచారణ ఈరోజు పూర్తి చేయలేం… మంగళవారం ఉదయానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. విచారణకు సమయం పడుతుందనుకుంటే… వాదనలను బట్టి మధ్యంతర బెయిల్ గురించి ఆలోచించవచ్చునని తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో మీ వాదనలు వింటామని కేజ్రీవాల్‌కు తెలిపింది. మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు… ఇవ్వకపోవచ్చు.. కానీ పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

Related posts

భూమి మనిషికి చెందదు.. అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు

Ram Narayana

ఎన్నికలకు ముందు ఎంతమందినని జైల్లో పెడతారు?: సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

Ram Narayana

పతంజలి’ కేసులో ఉత్తరాఖండ్ డ్రగ్స్ నియంత్రణ సంస్థపై సుప్రీం కోర్టు ఆగ్రహం

Ram Narayana

Leave a Comment