Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

పోలింగ్ 100 శాతం అయిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి…

  • ప్ర‌జాస్వామ్య విలువ‌ను చాటి చెప్పిన తెలంగాణ ప‌ల్లెలు
  • జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో వంద‌ శాతం పోలింగ్‌
  • అలాగే మెదక్‌ జిల్లా సంగాయిపేట తండాలోనూ ఓటర్ల‌ చైతన్యం

ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతుంది …అధికార యాత్రంగం , ఎన్నికల సంఘం ఎన్ని ప్రకటనలు చేసిన అధికారులను అప్రమత్తం చేసిన పోలింగ్ శాతం పెరగటంలేదు …ప్రత్యేకించి చదువుకున్న వారు అధికంగా ఉండే అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా జరగడం చూస్తున్నాం లోపం ఎక్కడ ఉంది దాన్ని అధిగమించడం ఎలా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది …ఎన్నికల్లో డబ్బు , మద్యం విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారనేది బహిరంగ రహస్యమే …చిన్న చితక వ్యాపారులను అవసర నిమిత్తం నగదు తరలించేవారిని పట్టుకొని ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు వందల ,వేల కోట్ల రూపాయలు తరలిస్తున్న చూసి చూడనట్లు ఉండటం గమనార్హం …తెలంగాణ ఎన్నికల్లో వందల కోట్ల నిధులు పోలీస్ వాహనాల్లోనే తరలించినట్లు వార్తలు గుప్పుమన్నాయి…వాటిపై చర్యలు లేవు …ఒక వేల కోట్ల రూపాయలు పట్టుకున్న లక్షల్లో పట్టుకున్నట్లు చూపించడం మనం చూస్తున్నాం …దీనికంతటికి ఎన్నికల సంఘం నిర్వహణ లోపలే కారణాలుగా ఉన్నాయి…

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో వంద‌ శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం విశేషం. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్‌ ఆఫీసర్ శ‌క్రు నాయక్‌, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్‌ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ప్ర‌త్యేకంగా అభినందించారు.

అలాగే మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ న‌మోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన‌ 62ఏ అదనపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా.. అంద‌రూ ఓటు వేశారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళా ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ట్లు పోలింగ్ సిబ్బంది వెల్ల‌డించారు.

ఈ రెండు గ్రామాల ప్రజలను అధికారులు అభినందించారు …అంతవరకూ బాగానే ఉన్నా వారికీ ఎన్నికల సంఘం పట్టుకున్న నిదులనుంచి కొన్ని ప్రోత్సహకంగా ఇస్తే మరిన్ని గ్రామాలు వీటిని ఆదర్శంగా తీసుకోని 100 శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటారు ..ఆదిశగా ఎన్నికల సంఘం ఆలోచనలు చేయాల్సి ఉంది …

తెలంగాణ‌లోని ఆ రెండు గ్రామాలు ప్ర‌జాస్వామ్య విలువ‌ను చాటి చెప్పాయి. అక్క‌డి ఓట‌ర్లు ఓటుతో త‌మ చైతన్యాన్ని చాటారు. లోక్‌సభ నాలుగో ద‌శ‌ ఎన్నికల్లో భాగంగా సోమ‌వారం రాష్ట్రంలో పోలింగ్ జ‌రిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్నకొల్వాయిలో వంద‌ శాతం పోలింగ్‌ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం విశేషం. ఇలా వంద శాతం ఓటింగ్‌కు కృషి చేసిన సెక్టోరల్‌ ఆఫీసర్ శ‌క్రు నాయక్‌, కార్యదర్శి ముద్దం విజయ, బీఎల్వో యశోద, రూట్‌ అధికారి రాజ్‌కుమార్‌ను కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ప్ర‌త్యేకంగా అభినందించారు.

అలాగే మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా ఏకంగా 100 శాతం పోలింగ్ న‌మోదైంది. ఈ తండాలో ఏర్పాటు చేసిన‌ 62ఏ అదనపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో 210 మంది ఓటర్లు ఉండగా.. అంద‌రూ ఓటు వేశారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళా ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ట్లు పోలింగ్ సిబ్బంది వెల్ల‌డించారు. దీంతో సంగాయిపేట తండా వాసుల‌ను మెద‌క్ క‌లెక్ట‌ర్ అభినందించారు. 

ఇదిలాఉంటే.. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదయిన‌ట్లు ఈసీ వెల్ల‌డించింది. గ్రామీణ తెలంగాణలో పోలింగ్ శాతం దాదాపు 70 శాతం దాట‌డం విశేషం.

Related posts

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ

Ram Narayana

1996 తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి రికార్డ్‌స్థాయి పోలింగ్…

Ram Narayana

మంత్రి జోగి రమేశ్‌కు ఈసీ నోటీసులు…

Ram Narayana

Leave a Comment