Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా మాటున మోడీ ప్రభుత్వంపెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం

– పోటు ప్రసాద్ సిపిఐ జిల్లా కార్యదర్


ఖమ్మం : దేశంలో కరోనాతో పౌరస
మాజం కునారిల్లుతున్న నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ప్రజలను అసంఘటిత రంగాల కార్మికులు, వలస కార్మికులను ఆవుదుకోవ
డంలో విఫమైందని కరోనా సెకండ్ వేవ్ వైరస్ మాటున ప్రజలపై పెనుభారం మోపుతూ వి
చ్చలవిడిగా అధికార అహంకారంతో అడ్డు అ
దుపు లేకుండా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీ
తంగా పెంచడంపై సిపిఐ ఖమ్మం జిల్లా కార్య
దర్శి పోటు ప్రసాద్ ఆగ్రహం ఊచేశారు. ఆది
వారం స్థానిక బైపాస్ రోడ్డుపై సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక వి
ధానాలను అవలంభిస్తూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కరోనా విపత్తులో గత సంవత్సర కాలంగా ఉపాధి లేక అనేక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్న సమయం
లో ఇలా పెట్రోల్ ధర పెంచడం దుర్మార్గమని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గిం
చాలని డిమాండ్ చేశారు. సెకండ్ వేవ్ విప
త్తు నివారణ కోసం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించి ప్రజలను రక్షించవలసిన కేం
ద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి
స్తుందని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ కా
లంలో అసంఘటిత రంగాల కార్మికులకు రూ. 7500/- లు ప్రతి ఒక్కరికి 20కేజీల సన్న బి
య్యం ఇచ్చి ఆర్ధికంగా ఆదుకోవాలని కోరా
రు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, మహ్మద్ సలాం, బి.జి.క్లెమెంట్, తాటి వెంకటేశ్వర్లు, పోటు కళావతి, కౌన్సిల్ మేకల శ్రీనివాస్, మందా వెంకటేశ్వర్లు, ఇటికల రామకృష్ణ, యానాల సాంబశివరెడ్డి, పి.మోహన్ రావు, బోడా వీరన్న, నూనె శశీదర్, షేక్ సైదా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికలు జరుపుతారా? వాయిదా వేస్తారా ? వారిష్టం కోర్ట్ జోక్యం చేసుకోదు…

Drukpadam

ఆ రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు 17 వేల మంది!

Drukpadam

అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సప్ స్పామ్ కాల్స్ పై రంగంలోకి కేంద్రం!

Drukpadam

Leave a Comment