Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై కేంద్రం ఉక్కుపాదం: జులై 1 నుంచే అమలు!

ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై కేంద్రం ఉక్కుపాదం: జులై 1 నుంచే అమలు!
16 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిన కేంద్రం..
ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల వరకు నిషేధం
ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలకు ఆదేశం
ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు

ప్లాస్టిక్ వాడకం మంచిది కాదని వాటిని వాడటం మానేయాలని ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు తేలిగ్గా అందుబాటులో ఉండటంతో వాటి వాడకాన్ని ఆపడంలేదు …వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేసి , ఫైన్ లు వేసినప్పటికీ ఫలితాలు ఇవ్వలేదు . ప్లాస్టిక్ గుట్టలు గుట్టలుగా పడి ఉంటుంది. అది మట్టిలో కలిసి పోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని వల్ల ఆరోగ్యాలు పాడౌతున్నాయి . అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై ఉక్కుపాదం పెట్టింది. ఒకసారి ఉపయోగించి పారేసే 16 రకాల వస్తువులను పూర్తిగా నిషేదించింది. ఈ నిషేధాన్ని జులై 1 తేదీనుంచి అమల్లోకి తేవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది….

ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీం కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్‌బాక్స్‌లు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్ (థర్మాకోల్) వంటి 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. జులై 1 నుంచే నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయవద్దని పెట్రోకెమికల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదంటూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీ చేయాలని, దీనిని ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా వాటి లైసెన్సు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్టు అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు వివరించింది.

Related posts

మిత్ర దేశం చైనాకు షాకిచ్చిన పాక్ కొత్త ప్రధాని..

Drukpadam

జగన్‌కు స్వల్ప అస్వస్థత, మధ్యాహ్నం అపాయింట్‌మెంట్లన్నీ రద్దు!

Ram Narayana

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్‌తో తెలంగాణ‌కు ముంపు ఉంది … ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ ర‌జ‌త్ కుమార్!

Drukpadam

Leave a Comment