Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

టీఎస్ ఎప్‌సెట్-2024 ఫ‌లితాల విడుద‌ల‌…

  • అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
  • ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త
  • ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
  • ఇందులో ఉత్తీర్ణులైన‌ అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదయింది. ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. అదే ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం వారికి మే 7, 8వ తేదీల్లో ప‌రీక్ష‌లు జ‌రిగాయి. అలాగే  9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ వారికి పరీక్షలను నిర్వహించ‌డం జ‌రిగింది.

Related posts

కెమెరాతో ఫోటో జర్నలిస్టులను క్లిక్ మనిపించిన మంత్రి పొంగులేటి…

Ram Narayana

ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ వద్దకు లగచర్ల భాదితులు …

Ram Narayana

మాజీమంత్రి తుమ్మలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ..?

Drukpadam

Leave a Comment