Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి

నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి
-గెలుపై లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయం
-జానారెడ్డి నే పోటీచేయమంటున్న అధిష్టానం
-తనయిడికోసం జానా పట్టు
కాంగ్రెస్ పార్టీలో సాగర్ ఉపఎన్నిక పై ఫోకస్ పెరిగింది . నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది . అప్పటివరకు రాష్ట్ర నేతలంతా ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం ఆదేశాలు జారీచేసింది . టీపీసీసీ చీఫ్ ఎంపిక కూడా దాదాపు వాయిదా పడినట్లు తెలుస్తుంది . సాగర్ లో గెలుపే లక్ష్యం గా పనిచేయాలని పీసీసీ నేతలు నిర్ణయించారు . టీ ఆర్ యస్ ఎమ్మెల్యే నోముల నరిసింహయ్య ఆకస్మిక మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది . 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కుందూరి జానారెడ్డి ఓటమి చెందారు . అంతకు ముందు ఆయన అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు . అధికార టీ ఆర్ యస్ కు ఏదురు దెబ్బలు తగులు తున్న ప్రస్తుత తరుణంలో , జరుగుతున్న ఈ ఉపఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది . దుబ్బాక ఉప ఎన్నిక లో గెలుపు ద్వారా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించటం తో బీజేపీ సాగర్ ఎన్నికలలో సత్తా చాటాలని చూస్తుంది . టీపీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమకుమార్ రెడ్డి రాజీనామా చేయటంతో పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక జరగాల్సి ఉండగా , గత నెలరోజులుగా కసరత్తు జరుగుతుంది . రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ రాష్టంలో కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ మంతనాలు , అభిప్రాయాల సేకరణ అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితులను హైకమాండ్ కు తెలియ జేశారు . రేపో మాపో అధ్యక్షుడి ని నియమిస్తారనగా సాగర్ ఉప ఎన్నిక రావటంతో ఆఎన్నిక తరువాత టీపీసీసీ చీఫ్ ను నియమించాలని సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు . దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ను రాష్ట్ర ముఖ్య నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవని కోరింది . దీంతో ఆయన ఉత్తమకుమార్ రెడ్డి , బట్టి విక్రమార్క , రేవంత్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , జట్టి కుసుమకుమార్ లతో వర్చువల్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన పీసీసీ అధ్యక్షుడి ఎంపికను సాగర్ ఉప ఎన్నిక వరకు వాయిదా వేయాలనే నిర్యానికి వచ్చినట్లు సమాచారం . ఆయనతో సమావేశమైన నాయకులు కూడా ఆయనకు అదే సూచించినట్లు తెలుస్తుంది . నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో పోటీ ఎవరు చేసిన అందరు కలిసి పనిచేయాలని అందుకు ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించినట్లు తెలుస్తుంది . అధిష్టానం తిరిగి జానారెడ్డి నే పోటీచేయాలని కోరుతుండగా ఆయన మాత్రం తన కుమారుడు రఘువీర్ రెడ్డి ని రంగంలోకి దించాలని చూస్తున్నారు . అధిష్టానం ఏమి చెప్పిన సాగర్ లో మాత్రం జానారెడ్డి చెప్పిందే తుది నిర్ణయంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు . ఇప్పటికే పీసీసీ పదవికోసం గ్రూప్ లు గా ఉన్న కాంగ్రెస్ పార్టీ లో సాగర్ ఎన్నిక ఐక్యతను తీసుకొస్తుందేమో చూడాలి !!!

Related posts

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి ముత్తంశెట్టి స్పందన.. అది నకిలీదన్న మంత్రి!

Drukpadam

కేంద్రమంత్రి తీరు బాధాకరం …పరామర్శకు వచ్చారా ?ఫోటోల కోసమా ?

Drukpadam

ఈటలపై కక్ష్య సాధింపే …ఉద్యమకారులు ఐక్యం కావాలి -కోదండరాం

Drukpadam

Leave a Comment