Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఐదే ఐదు నిమిషాల్లో 10 వేల స్టూడెంట్ వీసా స్లాట్ల బుకింగ్.. ఆందోళనలో విద్యార్థులు…

  • ఎఫ్ 1 వీసా ఇంటర్వ్యూలకు విపరీతమైన డిమాండ్
  • ఇలా స్లాట్లు తెరవగానే అలా బుక్ అయిపోతున్న వైనం
  • అమెరికా వర్సిటీల్లో సీటు వచ్చినా ఎఫ్ 1 వీసా ఇంటర్వ్యూకు స్లాట్ దొరకని పరిస్థితి

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. విద్యార్థులకు ఆ దేశం జారీ చేసే స్టూడెంట్ వీసా (ఎఫ్-1) లకు డిమాండ్ చాలా ఎక్కువ.  దీంతో వాటి కోసం విడుదల చేసే ఇంటర్వ్యూ స్లాట్ లకూ విపరీతమైన డిమాండ్ నెలకొంది. సోమవారం ఎఫ్-1 వీసా స్లాట్లు ఆన్ లైన్ లో విడుదల చేయగా.. కేవలం ఐదు నిమిషాల్లోనే ఏకంగా పదివేల స్లాట్లు బుక్ అయ్యాయి. దీంతో అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే యూనివర్సిటీల అడ్మిషన్ సంపాదించిన పలువురు విద్యార్థులు.. ఎఫ్-1 వీసా ఇంటర్వ్యూ కోసం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఏకంగా ఆరు నెలల నుంచి వీసా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వీసా స్లాట్లు విడుదల చేసిన ప్రతిసారీ నిమిషాల వ్యవధిలోనే బుక్ అవుతున్నాయని చెబుతున్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చేరేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వీసా ఇంటర్వ్యూ విషయంలోనే ఇబ్బంది పడుతున్నామని వివరించారు. ఇంటర్వ్యూ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడం గగనమైపోయిందని, స్లాట్లు దొరకడంలేదని వాపోయారు. తాజాగా సోమవారం కూడా ఐదు నిమిషాల్లో పది వేల వీసా స్లాట్లు బుక్ కావడంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో పలువురు విద్యార్థులు తమ పరిస్థితిని వివరిస్తూ వీసా స్లాట్లు పెంచాలంటూ అమెరికన్ ఎంబసీకి ఆన్ లైన్ లో రిక్వెస్ట్ పెడుతున్నారు. ఈ విజ్ఞప్తులపై హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ ట్విట్టర్ లో స్పందించారు. స్టూడెంట్ వీసా సెషన్ ను రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Related posts

ఇండియాకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Ram Narayana

ఆస్కార్ కు వేళాయె… ముఖ్యమైన నామినేషన్స్ ఇవిగో!

Ram Narayana

వరల్డ్ బెస్ట్ ఎయిర్ పోర్టుల జాబితాలో శంషాబాద్ ఎయిర్ పోర్టు…

Ram Narayana

Leave a Comment