Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంఆఫ్ బీట్ వార్తలు

దుబాయ్‌ లాటరీలో భార‌తీయ మ‌హిళ‌కు జాక్‌పాట్..!

  • రూ. 8.3 కోట్లు గెలుచుకున్న‌ పంజాబ్‌కు చెందిన పాయ‌ల్ 
  • పెళ్లిరోజు కానుక‌గా భ‌ర్త ఇచ్చిన న‌గ‌దు బ‌హుమ‌తితో లాట‌రీ టికెట్ కొన్న పాయ‌ల్‌
  • 12 ఏళ్లుగా దుబాయ్‌ లాటరీలో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న భార‌తీయురాలు
  • ఇప్పుడు లక్ కలిసి రావడంతో గ్రాండ్ ప్రైజ్‌మనీ సొంతం

దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లో భార‌తీయ మ‌హిళ‌కు జాక్‌పాట్ త‌గిలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో భార‌తీయురాలు 1 మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.3 కోట్లు) గెలుచుకున్నారు. పంజాబ్‌కు చెందిన పాయ‌ల్ ఈ జాక్‌పాట్ కొట్టారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే కోటీశ్వ‌రురాల‌య్యారు. 

ఏప్రిల్‌లో పెళ్లిరోజు కానుక‌గా భ‌ర్త ఇచ్చిన న‌గ‌దు బ‌హుమ‌తితో ఆమె ఆన్‌లైన్ ద్వారా లాట‌రీ టికెట్ కొనుగోలు చేశారు. అలా కొన్న లాటరీ టికెట్ పాయ‌ల్‌కు ఇప్పుడు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెల 16న తీసిన డ్రాలో ఆమె కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్ నం.3337కు జాక్‌పాట్ త‌గిలింది. దీంతో రూ. 8.3 కోట్ల భారీ ప్రైజ్‌మనీ ఆమె సొంతమైంది.   

కాగా, గ‌త 12 ఏళ్లుగా ఆమె దుబాయి లాటరీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నార‌ట‌. ఏడాదికి ఒక‌టి లేదా రెండుసార్లు భ‌ర్త‌, పిల్ల‌ల పేర్ల మీద క్ర‌మం త‌ప్ప‌కుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న‌ట్లు పాయ‌ల్ తెలిపారు. చివ‌రికి భ‌ర్త ఇచ్చిన క్యాష్‌ గిఫ్ట్‌తో కొన్న లాట‌రీ టికెట్ త‌న‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింద‌న్నారు. ఇంత భారీ మొత్తం గెలుచుకోవ‌డం ప‌ట్ల ఆమె హ‌ర్షం వ్యక్తం చేశారు.

ఇక తాను గెలుచుకున్న భారీ ప్రైజ్‌మ‌నీలో కొంత భాగం పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం, మ‌రికొంత భాగం ఆస్ట్రేలియాలో ఉంటున్న త‌న సోద‌రుడికి సాయం చేస్తాన‌ని ఆమె చెప్పారు. ఈ సంద‌ర్భంగా దుబాయి డ్యూటీ ఫ్రీ లాట‌రీ నిర్వాహ‌కుల‌కు ఆమె ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 

ఇదిలాఉంటే.. 1999లో ప్రారంభ‌మైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 1 మిలియ‌న్ డాల‌ర్లు గెలుచుకున్న భార‌తీయుల్లో పాయ‌ల్‌ 229వ వ్య‌క్తి. కాగా, ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది భార‌తీయులేన‌ని లాట‌రీ నిర్వాహ‌కులు చెబుతున్నమాట‌.

Related posts

దక్షిణ కొరియాకు క్షమాపణలు తెలిపిన పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు… !

Ram Narayana

ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి

Ram Narayana

వాహ్ అనిపించేలా దక్షణ కొరియా దిగ్గజ ఎల్జీ కంపెనీ వినూత్న టీవీ ఆవిష్కరణ

Ram Narayana

Leave a Comment