Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది: సీఈఓ ముకేశ్ కుమార్ మీనా…

  • మాచ‌ర్ల‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి
  • ఆ ఈవీఎంలోని డేటా భ‌ద్రంగా ఉందంటూ సీఈఓ ప్ర‌క‌ట‌న‌ 
  • డేటా భ‌ద్రంగా ఉండ‌డం వ‌ల్లే రీపోలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని వివ‌ర‌ణ‌
  • పోలింగ్ నాడు మాచ‌ర్ల‌లో ఇలాంటివి 7 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని వెల్ల‌డి

ఏపీలోని మాచ‌ర్ల‌లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంద‌ని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డేటా భ‌ద్రంగా ఉండ‌డం వ‌ల్లే రీపోలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని వివ‌రించారు. పోలింగ్ నాడు మాచ‌ర్ల‌లో ఇలాంటివి 7 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని వెల్ల‌డించారు. 

అందులో కొంద‌రు ఈవీఎంల‌ను ధ్వంసం చేసిన‌ట్లు వెబ్‌కాస్టింగ్‌లో గుర్తించామ‌ని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంద‌రిని గుర్తించాల్సి ఉంద‌ని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘ‌ట‌నల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న.. సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు. 

20వ తేదీన రెంట‌చింత‌ల కోర్టులో ఎస్ఐ మెమో దాఖ‌లు చేయ‌డంతో పాటు మొద‌టి నిందితుడిగా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ది సెక్ష‌న్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టిన‌ట్లు సీఈఓ వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న‌కు ఏడేళ్ల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

Related posts

 జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు: కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

ఓటర్ స్లిప్ అందకుంటే ఏం చేయాలంటే.. !

Ram Narayana

మణిపూర్‌లోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్…

Ram Narayana

Leave a Comment