Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిధిగా సోనియా గాంధీ!

జూన్ 2 తెలంగాణ దశబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కానున్నారు ..తెలంగాణ ఇచ్చిన నేతగా ఆమెకు పేరుంది ..ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణహించింది …ఈ మేరకు రాష్ట్ర కాబినెట్ కూడా ఆమోదం తెలిపింది …
సోనియా గాంధీ జూన్ 2న తెలంగా ణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం విదితమే .

అనంతరం జరిగిన ఎన్నిక ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరా జయం పాలైంది. దాదాపు 10 ఏండ్లు తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

దీంతో ఇటీవల ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సమ క్షంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవం రోజున సోని యాగాంధీ చేత తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించను న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయ నుంది. “జయ జయ హే తెలంగాణ” అనే గీతాన్ని ప్రముఖ కవి మరియు గేయ రచయిత అందె శ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4 న క్యాబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది.

ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రి వర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు…

Related posts

తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం

Ram Narayana

నా ఫోన్ టాప్ చేసి నన్ను బెదిరించారు …సంధ్య కనస్ట్రక్షన్ ఎండి శ్రీధర్

Ram Narayana

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!

Drukpadam

Leave a Comment