Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

స్వాతి మాలివాల్‌పై దాడి కేసు మీద తొలిసారి స్పందించిన కేజ్రీవాల్..

  • ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానన్న కేజ్రీవాల్
  • న్యాయం జరగాలని వ్యాఖ్య
  • ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయన్న కేజ్రీవాల్
  • నిష్పక్షపాత విచారణ జరిగినప్పుడే సరైన న్యాయం అందుతుందన్న ఢిల్లీ సీఎం

పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ మీద దాడి ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని… న్యాయం జరగాలని అన్నారు. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇద్దరి వైపు నుంచి నిష్పక్షపాత విచారణ జరిగినప్పుడే సరైన న్యాయం అందుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని… కాబట్టి ఏమీ మాట్లాడలేనన్నారు. 

కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌తో బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బిభవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని ముంబైకి తీసుకువెళ్లారు. నిందితుడి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

Related posts

మాపై వైమానిక దాడులు.. మావోయిస్టుల సంచలన ఆరోపణలు…

Ram Narayana

భక్తులతో కిటకిటలాడుతున్నశబరిమల గిరులు…

Ram Narayana

బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం… 8 మంది మృతి

Ram Narayana

Leave a Comment