Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉప్పాడ బీచ్ లో ముందుకు వచ్చిన సముద్రం… తీవ్రంగా ఎగసిపడుతున్న అలలు

  • బంగాళాఖాతంలో ‘రెమాల్’ తుపాను
  • ఉప్పాడ బీచ్ లో నిన్నటి నుంచే అలల తీవ్రత
  • నేడు మరింత ఉద్ధృతంగా మారిన అలలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం బాగా ముందుకు వచ్చింది. 

నిన్నటి నుంచి ఉప్పాడ బీచ్ లో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ నీటిమట్టం పెరగడంతో ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చింది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

‘రెమాల్’ తుపాను గురించి ఐఎండీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఓ ప్రకటనలో పేర్కొంది.

Related posts

మాస్క్ ధరించని ట్రాఫిక్ సీఐ.. జరిమానా విధించాలన్న ఎస్పీ

Drukpadam

 మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన

Ram Narayana

మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి …హైద్రాబాద్ లో కేంద్రమంత్రికి టీయూడబ్ల్యూజే వినతి

Ram Narayana

Leave a Comment