మే 30 నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం..
- మే 30తో వారాణాసిలో ముగియనున్న ప్రధాని మోదీ ప్రచారం
- జూన్ 1న వారణాసి లోక్ సభ స్థానానికి పోలింగ్
- మే 30 సాయంత్రం కన్యాకుమారి చేరుకోనున్న ప్రధాని
- కన్యాకుమారిలో రేయింబవళ్లు మోదీ ధ్యానం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా… ప్రధాని మోదీ కన్యాకుమారిలోని సుప్రసిద్ధ పర్యాటక స్థలం రాక్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. మే 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. అందుకు ఇక్కడి ధ్యానమండపం వేదిక కానుంది. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేయనున్నారు.
ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరగనుండగా, మే 30తో ప్రచారం ముగుస్తుంది. అదే రోజున మోదీ కన్యాకుమారి చేరుకుని రేయింబవళ్లు ధ్యానంలో కూర్చుంటారని తెలుస్తోంది.