Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్లు…

  • ఈరోజు అనేక నంబర్ల నుండి చంపుతామంటూ బెదిరింపు ఫోన్లు వచ్చాయన్న రాజాసింగ్
  • బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదని వెల్లడి
  • గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్న రాజాసింగ్
  • బాధ్యతాయుతమైన పౌరుడిగా పోలీసులకు తెలియజేస్తున్నానని వెల్లడి

ఈరోజు తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని… తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు.

ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని… కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను రాజాసింగ్ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రధాని మోదీ, పీఎంవో ఇండియా, అమిత్ షా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ సీఎంవోలను ఆయన ట్యాగ్ చేశారు.

Related posts

మరో 232 యాప్‌లను నిషేధించనున్న కేంద్రం.. చైనా లింకులే కారణం..

Drukpadam

చిత్తూరు జిల్లాలో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన‌ పోలీసులు..

Drukpadam

ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసులు …విచారణకు ఆదేశించిన సీపీ!

Drukpadam

Leave a Comment