Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ కోసం 17 కంప్యూటర్లు…ప్రణీత్ రావు

  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నీ ధ్వంసం చేశాం

  • ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, మూసారాంబాగ్ మూసీలో పడేసినట్లు వెల్లడి
  • సీడీఆర్, ఐడీపీఆర్ డేటా మొత్తాన్ని కాల్చేశామన్న ప్రణీత్ రావు
  • ప్రభాకర్ రావు రాజీనామా చేసే ముందు రికార్డులను ధ్వంసం చేయాలని ఆదేశించారని వెల్లడి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పటికప్పుడు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు తమ వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కూడా ఈ కేసులో ఎన్నో అంశాలను తన వాంగ్మూలంలో వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రికార్డులను అన్నింటినీ ధ్వంసం చేశామని తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, మూసరాంబాగ్ వద్ద మూసీలో పడేశామన్నారు. సీడీఆర్, ఐడీపీఆర్ డేటా మొత్తాన్ని కాల్చేసినట్లు చెప్పారు. ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశామన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్టువేర్‌ను వినియోగించినట్లు చెప్పారు. 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశామని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని కూడా ఆదేశించినట్లు చెప్పారు.

దాదాపు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకునే వారమన్నారు. నేతలు, జడ్జిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. పదిహేడు హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలక సమాచారం ఉందన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసిన భుజంగరావు ప్రణిత్రావు సహకారంతో ట్యాపింగ్ చేసిన భుజంగరావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికసాయం అందించే వారి ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ ట్యాపింగ్ చేసి SOT, టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లాం భుజంగరావు

ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం: భుజంగరావు

ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం: భుజంగరావు

జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూడు ఉపఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం: భుజంగరావు

రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్రావు, శ్రవణ్కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశాం

మాదాపూర్ SOT నారాయణ సపోర్ట్ ఆపరేషన్ చేశాం

అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది: భుజంగరావు

ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం: భుజంగరావు సివిల్ తగాదాలను సెటిల్ చేశాం

కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్

రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్దఎత్తున తరలించా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం

రియల్టర్ సంధ్యా శ్రీధర్రావును రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం మాట వినక పోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టాం

కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాం హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో కేటీఆర్పై విమర్శలుచేసిన ప్రతిఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశాం

Related posts

బెదిరింపు కాల్ తో ముంబై ఎయిర్ పోర్ట్ లో భద్రత అప్రమత్తం!

Drukpadam

బుర్కినా ఫాసోలో దారుణం.. మిలటరీ యూనిఫాంలో గ్రామంలోకి చొరబడి 60 మంది కాల్చివేత…

Drukpadam

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై ఐటీ పంజా… రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

Drukpadam

Leave a Comment