Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

హిందూపురం పోల్ డేటా విడుదల చేసిన ఏపీ సీఈవో కార్యాలయం…

  • ఏపీలో మే 13న పోలింగ్ 
  • లోక్ సభ నియోజకవర్గాల వారీగా పోల్ డేటా విడుదల చేస్తున్న సీఈవో కార్యాలయం
  • హిందూపురం లోక్ సభ స్థానం పరిధిలో 84.70 శాతం పోలింగ్
  • అత్యధికంగా ధర్మవరం అసెంబ్లీ స్థానంలో 88.83 శాతం పోలింగ్
  • అత్యల్పంగా హిందూపురం అసెంబ్లీ స్థానం పరిధిలో 77.82 శాతం పోలింగ్

ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేడు హిందూపూరం పార్లమెంటరీ స్థానం పోల్ డేటాను విడుదల చేసింది. హిందూపురం లోక్ సభ నియోజకవర్గం మొత్తమ్మీద 84.70 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించింది. 

హిందూపూరం ఎంపీ స్థానం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,56,775 కాగా… 14,03,259 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపింది. వారిలో పురుష ఓటర్ల శాతం 85.46, మహిళా ఓటర్ల శాతం 83.94, ట్రాన్స్ జెండర్ ఓటర్ల శాతం 47.36 అని సీఈవో కార్యాలయం వివరించింది. 

ఇక, హిందూపురం లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో నమోదైన పోలింగ్ వివరాలను కూడా సీఈవో కార్యాలయం పంచుకుంది. అత్యధికంగా ధర్మవరం అసెంబ్లీ స్థానంలో 88.83 శాతం పోలింగ్ నమోదు కాగా… అత్యల్పంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 77.82 శాతం ఓటింగ్ నమోదైంది. 

మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో 87.45, పెనుకొండలో 86.96, పుట్టపర్తిలో 86.27, రాప్తాడులో 85.09, కదిరిలో 81.37 శాతం పోలింగ్ నమోదైనట్టు సీఈవో కార్యాలయం పేర్కొంది.

Related posts

ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజు ఎన్నికలు

Ram Narayana

తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో 2,898 మంది

Ram Narayana

 జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు: కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

Leave a Comment