కలకలం రేపిన మంత్రి పొంగులేటిపై లేఖాస్త్రం …
పొంగులేటి అనుయాయిల గరం గరం
7 గురిపేరుతో లేఖ విడుదల …తమ సామజిక వర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శలు
ఫ్రమ్ ..ఖమ్మం కలెక్టరేట్ నుంచి అని లేఖ పై ఉంది ..
లేఖపై పేర్లు ఉన్న వారి సంతకాలు లేకపోవడం గమనార్హం
విదేశ టూర్ లో ఉన్న పొంగులేటి …నేటి రాత్రికి రాష్ట్రానికి చేరుకొనే అవకాశం ..
ఖమ్మం జిల్లాకు చెందిన పాలేరు శాసనసభ్యుడు ,రాష్ట్ర రెవెన్యూ , గృహనిర్మాణ , సమాచార ప్రసార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నేడు కమ్మవారిపేరుతో వచ్చిన లేఖ కలకలం సృష్టిస్తుంది …ఆయన తమ సామజిక వర్గాన్ని విస్మరిస్తున్నారని ,అసలు కమ్మవాళ్లని దగ్గరకు రానివ్వడంలేదని మంత్రిపై వారు డైరెక్ట్ ఎటాక్ చేయడం గమనార్హం … ఆయన చేసే పనులు చేరదిశే వ్యవహారంలో తమ సామాజికవర్గానికి అన్యాయం చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు … తుమ్మల నాగేశ్వరావు చలవతో కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన పొంగులేటి కోట్లాది రూపాయలు , భూములు , ఆస్తులు సంపాదించారని ,కాగా తుమ్మల మాత్రం నిజాయతీగా వ్యవహరించారని అందువల్ల ఆయన ఏమి సంపాదించుకోలేక పోయారని ఆ లేఖలో పేర్కొన్నారు ..తుమ్మల తలచుకుంటే తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 3 లక్షల కోట్లు సంపాదించి ,రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు …ఎన్టీఆర్ 7 సంవత్సరాలు , చంద్రబాబు 14 సంవత్సరాలు పదవి కాలంలో ప్రజలకు ఎంతో సేవచేశారని కొనియాడారు …కానీ పొంగులేటి పెత్తనంతో రెండు రాష్ట్రాల్లోని కమ్మ సామజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారని ఆగ్రహం ప్రకటించారు …అందువల్ల కమ్మవాళ్ల సత్తా నిరూపించుకోవాలని అందుకు నిలబడి కలబడాలని ఏపీలో జగన్ రెడ్డిని , కేంద్రంలో బీజేపీని రాకుండా చేయాలనీ పేర్కొన్నారు ..
తన వెంట తిరుగుతున్న తమ వర్గానికి చెందిన మువ్వా విజయబాబుకు పెద్ద పదవి ఇప్పించే బదులు కేవలం కార్పొరేషన్ చైర్మన్ అనే చిన్నపదవి ఇవ్వడంపై ఆలేఖలో వారు విస్మయం వ్యక్తం చేశారు … ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే ప్రతి చిన్న పెద్ద కార్యక్రమాలకు హాజరవుతూ వారికీ నూతన వస్త్రాలు , డబ్బులు అందజేస్తుంటారని కానీ దాని వెనక ఆయన నిజస్వరూపాన్ని గమనించాలని లేఖలో ప్రస్తావించారు …నామ నాగేశ్వరరావు 60 ఏళ్లలో సంపాదించలేనిది 10 ఏళ్లలో 10 వేల కోట్లు అక్రమంగా సందించాడని ,పనులు చేయకుండానే బిల్లులు చేయించుకోవడంలో ఆయన నేర్పరి అని ఆరోపణలు గుప్పించారు …ఆయన పక్క జగన్ రెడ్డి ఏజెంట్ …తనకు తానే శీనన్న అని పిలిపించుకుంటాడు …కానీ తన పక్కన తిరిగే విజయబాబును విజయన్న అని ఎవరైనా పిలిస్తే సహించరాని పేర్కొన్నారు..తమకే ఈవిధంగా ఉంటె మిగతా కులాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు …
కొత్తగా నిర్మించే త్రిబుల్ ఆర్ పక్కన 1000 ఎకరాల కాజేయాలని చూస్తున్నారని, అందులో బీఆర్ యస్ , బీజేపీ వాళ్ళని కూడా భాగస్వాములను చేయాలనీ ప్లాన్ వేశారని ఆరోపించారు .. మంత్రిగా ఐదేళ్లలో 2 లక్షల కోట్లు టార్గెట్గా పెట్టుకున్నారని వారు లేఖలో అన్నారు …
ఆయన చేస్తున్న పనులు , పిలుస్తున్న పిలుపులు చూసి నిజమే అనుకున్నాం … ఆప్యాతపై సంతోషించాం … కానీ మంత్రి అయన తర్వాత ఆయనకు తమ్ముడు , వియ్యంకుడు తప్ప ఎవరు కనిపించడంలేదని వారు లేఖలో వాపోయారు …
దీనిపై పొంగులేటి అనుయాయిలు గరం గరం అవుతున్నారు …తమ నాయకుడిపై కొందరు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని కొట్టి పారేశారు …ఆయన ఎదుగుదలను చూసి ,ఈర్ష్య ,ద్యేషంతో లేఖను విడుదల చేసినట్లుగా భావిస్తున్నామని అన్నారు..మంత్రి పొంగులేటి ఏ ఒక్క కులకానికి వ్యతిరేకం , అనుకూలం కాదని అందరిని ఆప్యాయతతో చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్న, అమ్మ ,పెద్దమ్మ , పెద్దాయన అని పిలవడం ఆయన నైజమని అన్నారు …ఇంటికి వచ్చిన వారిని ఎవరినైనా గౌరవించడం పదవి ఉన్న లేకున్నా చేస్తున్నారని అలాంటి పొంగులేటిపై నిందారోపణలు తగవని హితవు పలికారు ..పొంగులేటి విదేశీ పర్యటనుంచి రాష్ట్రానికి చేరుకున్న రోజున లేఖ బయటకు రావడం గమనార్షం …