Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం… బస్సు లోయలో పడి 21 మంది మృతి…!

  • 40 మంది వరకు గాయాలు
  • జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడిన బస్సు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అఖ్నూర్ వద్ద గురువారం ఓ బస్సు లోయలో పడిపోవడంతో దాదాపు 21 మంది మృతి చెందారు. 40 మంది వరకు గాయపడ్డారు. ఈ బస్సులో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. వారు జమ్మూ నుంచి రియాసీ జిల్లాలోని శివ్ ఖోరికి వెళుతున్నారు. జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో బస్సు లోయలో పడింది.

క్షతగాత్రులను అఖ్నూర్‌లోని స్థానిక ఆసుపత్రికి, జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. హత్రాస్ నుంచి ప్రయాణికులను తీసుకువెళుతున్న బస్సు ప్రమాదానికి గురైందని… సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు ప్రకటించారు.

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అఖ్నూర్‌లో బస్సు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేసియా అందిస్తామని తెలిపారు.

Related posts

ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన… రైల్వే శాఖ కీలక నిర్ణయం!

Ram Narayana

అది మహాకుంభ్ కాదు… మృత్యుకుంభ్: మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు!

Ram Narayana

సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాన్ని వెల్లడించిన కేంద్రం!

Drukpadam

Leave a Comment