Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఎగ్జిట్ పోల్ డిబేట్లపై కాంగ్రెస్ యూటర్న్!

  • తొలుత ఎగ్జిట్ పోల్ డిబేట్లల్లో పాల్గొనేది లేదన్న కాంగ్రెస్
  • అనంతరం, ఖర్గే నివాసం ఇండియాలో కూటమి నేతల సమావేశంః
  • టీవీ చర్చల్లో పాల్గొనేందుకు నిర్ణయం
  • బీజేపీ తీరును ఎండగట్టేందుకు టీవీ డిబేట్లల్లో పాల్గొంటామన్న కాంగ్రెస్

ఎగ్జిట్ పోల్స్ పై చర్చల్లో పాల్గొనబోమని ఇటీవల ప్రకటించిన ఇండియా కూటమి తాజాగా యూటర్న్ తీసుకుంది. తాము ఎగ్జిట్ పోల్స్ పై టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటామని శనివారం వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మీడియా, పబ్లిసిటీ శాఖ అధిపతి పవన్ ఖేరా మీడియాకు తెలిపారు. ‘‘ఎగ్జిట్ పోల్ చర్చలతో కలిగే అనుకూల ప్రతికూల ప్రభావాలపై చర్చించాక టీవీ డిబెట్లల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నిర్ణయించింది’’ అని పేర్కొన్నారు. దీనిపై కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో చర్చించారని, బీజేపీ తీరును ఎండగట్టేందుకు నిర్ణయించారని అన్నారు. 

అంతకుమునుపు, ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ పై టీవీల్లో చర్చలకు దూరంగా ఉంటామని పేర్కొన్నారు. ముందుగానే ఫలితాలు ఫిక్సైన ఎగ్జిట్ పోల్స్ పై చర్చించి టీవీల టీఆర్‌పీలు పెంచే ఉద్దేశం లేదని పేర్కొంది. దీంతో, కాంగ్రెస్ నిర్ణయంపై అమిత్ షా సెటైర్లు వేశారు. లోక్ సభలో ఓటమి తప్పదన్న అంచనాకు కాంగ్రెస్ వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు రాహుల్ సారథ్యం వహిస్తున్నారు కాబట్టి నిజం తెలుసుకునేందుకు పార్టీ సంసిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్ డీబెట్లలో పాల్గొనేందుకు సిద్ధమైంది. 

Related posts

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మోదీ హామీ…

Ram Narayana

లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు.. 4 సీట్లకు అంగీకారం: బీజేపీ నేత యడియూరప్ప

Ram Narayana

రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ… అదృష్టం అంటే ఆయనదే!

Ram Narayana

Leave a Comment