Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మంత్రి కోమటిరెడ్డి మాజీమంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం….

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి…కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జైలుకు వెళ్ళక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించగా ఆయన మతి భ్రమించి మాట్లుడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు …హరీష్ అమెరికా వెళ్ళింది కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ ప్రమేయాన్ని బయటపెట్టవద్దని అమెరికాలో ఉన్న ప్రభాకర్ కు చెప్పేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లారని కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై హరీష్ రావు ఘాటుగానే స్పందించారు …ఇరువురి మధ్య మాటల యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది …

కోమటిరెడ్డి ఏమన్నారు …

ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి నేతృత్వంలో పనిచేసేలా రాధాకృష్ణరావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న తదితరులతో ఒక రౌడీ గ్యాంగ్ మాదిరిగా ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లు చేసి వేల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. ఎంత పెద్ద తప్పు చేశావ్ కేసీఆర్ నువ్వు? అని వ్యాఖ్యానించారు.

“అందరం ఇరుక్కున్నాం… ఇక లాభం లేదు అని కేసీఆర్ తెలుసుకున్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నాడని, ఆయన ఇక్కడికొచ్చి అప్రూవర్ గా మారితే తామంతా దొరికిపోతామని తెలుసుకుని, ముందే తన మేనల్లుడు హరీశ్ రావును అమెరికా పంపించారు.

మే 26న ఎమిరేట్స్ విమానం (ఫ్లయిట్ నెం. ఈకే 525) వేకువ జామున 4.35 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరింది. ఆ విమానంలో హరీశ్ అమెరికా వెళ్లాడు. తిరిగి అమెరికా నుంచి ముంబయి మీదుగా నిన్న ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లో దిగాడు.

ఆ టెలిఫోన్ ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలోని చికాగో, కొలరాడో ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. హరీశ్ రావు ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా ఫ్యామిలీతో కలిసి అమెరికా పోయి ప్రభాకర్ రావు ను కలిశాడు. కనీసం మీడియా వాళ్లకు కూడా హరీశ్ రావు ఎక్కడికి వెళ్లాడో తెలియదు.

హరీశ్ రావు అమెరికా వెళ్లిన సంగతి ఎయిర్ పోర్టుకు వెళితే అన్ని వివరాలు లభ్యం అవుతాయి. ప్రభాకర్ రావును భారత్ కు రాకుండా ఆపేందుకు హరీశ్ రావు అమెరికా వెళ్లారు” అంటూ కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు.

హరీష్ రావు మాటల్లోనే …

“నేను అమెరికా వెళ్లి రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావును కలిశానని ఆరోపిస్తున్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా? సీఎం, ఆయన మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారనడానికి ఇదే నిదర్శనం.

నేను ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లాను… అందులో అబద్ధమేమీ లేదు. కానీ, ప్రభాకర్ రావును కలిశానని కోమటిరెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి… నేను ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే హైదరాబాదులో అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకేసి రాస్తాను. తన ఆరోపణలు నిరూపించుకోకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెబుతారా?

ఈ అంశంపై ఎక్కడ చర్చించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అమెరికాలో ఎక్కడికి వెళ్లాను, ఏ హోటల్ దిగాను? అనే వివరాలతో పాటు పాస్ పోర్టు స్టాంపింగ్ వివరాలతో సహా నేను చర్చకు వస్తాను… మంత్రి కోమటిరెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలతో చర్చకు వస్తారా? టైమ్, డేట్ కోమటిరెడ్డి చెప్పాలి” అంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు.

Related posts

పాలనలో పట్టుకోసం రేవంత్ అడుగులు… 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

Ram Narayana

కానిస్టేబుల్ ను చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్ అలీ.. వీడియో ఇదిగో!

Ram Narayana

తెలంగాణలో దళితబంధుకు బ్రేకులు..! ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ

Ram Narayana

Leave a Comment