Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ పాట వింటూ కంటతడి పెట్టుకున్న అందెశ్రీ..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు…పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు.

రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు…సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అంటూ వస్తున్నా జై తెలంగాణ పాట వింటూ అందెశ్రీ కంట కన్నీటితో ఆ పాటను ఆలకిస్తూ భావోద్వేవం చెందారు…పాట వింటున్నంత సేపు ఆయన కళ్లలో కన్నీరు ఆగలేదు. తెగింపు, త్యాగాల చరిత్ర కలిగిన ఈ పాటతో ఫరేడ్ గ్రౌండ్ లో ఒక భీకర వాతావరణం ఏర్పడింది …అనంతరం కీరవాణి ని మాట్లాడమన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకనాడు పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత… రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, సత్తువుంది… తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు అన్నారు…

Related posts

అమెజాన్‌లో తెలంగాణ యువ‌కుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో జాబ్‌!

Ram Narayana

వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి సీఎం రేవంత్ ఆహ్వానం

Ram Narayana

తన ఇంటిపై ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారంటే..!

Ram Narayana

Leave a Comment